Begin typing your search above and press return to search.
మరోసారి `డాన్`గా నటిస్తున్న బిగ్ బి
By: Tupaki Desk | 12 Oct 2020 9:00 AM GMTవెండితెరపై డాన్ పాత్రల్లో మెప్పించాలంటే అందుకు తగ్గ కాలిబర్ ఉన్న నటుడిని ఎంపిక చేయాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. కింగ్ ఖాన్ షారూక్.. సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు స్టార్లు డాన్ పాత్రల్లో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. అమితాబ్ .. షారూక్ కి ఈ తరహా పాత్రల్లో ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఉంది. 1978 లో అమితాబ్ నటించిన `డాన్` ఒక ట్రెండ్ సెట్టర్.
అందుకే బిగ్ బి మరోసారి డాన్ పాత్రలో నటిస్తున్నారు అనగానే అభిమానుల్లో ప్రత్యేకించి క్యూరియాసిటీ నెలకొంది. ఇంతకుముందు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో గ్రే షేడెడ్ రోల్ లో నటించినా... కానీ ఇప్పుడు టీవీ సిరీస్ కోసం ఆయన డాన్ గా మారుతున్నారన్న వార్తతో బుల్లితెర వీక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది.
గ్రెగొరీ డేవిడ్ రాబర్ట్స్ నవల `శాంతారామ్`ను ఆపిల్ టీవీ సిరీస్ గా తెరకెక్కించనున్నారు. ఈ సిరీస్ లో చార్లీ హున్నం- రాధికా ఆప్టే నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ లో నేరస్తుడైన డాన్ కదర్ ఖాన్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. ఈ సిరీస్ 2021 లో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ధారావి .. దక్షిణ ముంబైలలో లైవ్ లొకేషన్లలో ఈ సిరీస్ ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.