Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ వేళ బిగ్ బీ అమితాబ్ పెద్ద మనసు
By: Tupaki Desk | 6 April 2020 12:40 PM ISTకరోనా వ్యాప్తితో లాక్ డౌన్ విధించారు. దీంతో సర్వం బంద్ అయిపోయింది. సినిమాలు ఆగిపోయాయి. ఈ సినీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డారు. వారికి తిండికి లేని పరిస్థితి ఎదురైంది. దీంతో వారిని ఆదుకునేందుకు చిరంజీవి - టాలీవుడ్ అగ్రహీరోలు మందుకొచ్చి సంస్థను ఏర్పాటు చేసి వారికి సేవ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా తాజాగా సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చాడు. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ ఫెడరేషన్ కు చెందిన లక్ష మంది కార్మికులకు నెల రోజుల పాటు నిత్యావసరాలు అందజేస్తానని ప్రకటించారు.
అమితాబ్ బచ్చన్ సాహసోపేతమైన నిర్ణయంపై సినీ వర్గాలు - దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. సోని పిక్చర్స్ - కల్యాణ్ జువెల్లర్స్ కూడా అమితాబ్ కు మద్దతుగా నిలిచాయి.
ఇక తాజాగా పీఎం కేర్స్ ఫండ్ కు విరాళాలు పోటెత్తుతున్నాయి. మానవ వనరుల శాఖ ఉద్యోగులు ఏకంగా 38కోట్ల విరాళాన్ని ప్రకటించాయి. కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేసే సిబ్బంది రూ.10 కోట్లు - నవోదయ పాఠశాలలు రూ.7.5కోట్లు - ఇండియన్ బ్యాంకు ఉద్యోగులు రూ.8.10 కోట్లను పీఎం కేర్ ఫండ్స్ కు విరాళం అందజేశారు.