Begin typing your search above and press return to search.

అమర జవానుల కుటుంబాలకు అమితాబ్ సాయం

By:  Tupaki Desk   |   16 Feb 2019 5:14 PM GMT
అమర జవానుల కుటుంబాలకు అమితాబ్ సాయం
X
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జైష్ ఏ మొహమ్మద్ సంస్థ తీవ్రవాద దాడిలో 49 మంది సీఆర్పీఎఫ్ జవానులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిని దేశం యావత్తూ ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీలు చాలామంది ఇప్పటికే ఈ దాడిపై తమ స్పందనను తెలిపారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్.. అక్షయ్ కుమార్ తదితరులు ఇప్పటికే తమ ట్విట్టర్ ఖాతా ద్వారాఈ దాడిని ఖండించారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక అడుగు ముందుకు వేసి అమరులైన జవానుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. దాడిజరిగిన ప్రదేశంలో 40 మంది జవానులు ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన ఇతర జవానులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా శుక్రవారం సాయంత్రానికి మృతుల సంఖ్య మొత్తం 49 కి చేరింది. ఈ 49 మంది జవానుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ అధికారిక ప్రతినిథి కూడా ధృవీకరించారు. "అమితాబ్ బచ్చన్ గారు అమరుల కుటుంబాలకు ఈ విరాళాన్ని అందజేసేందుకు సరైన ప్రాసెస్ ను తెలుసుకుంటున్నారు. త్వరలోనే అమరులైన ప్రతి జవాను కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నగదు అందజేస్తారు" అని ఆయన తెలిపారు.