Begin typing your search above and press return to search.
7ఏఎం లొకేషన్ కి వెళ్లిన 78 ఏజ్ అమితాబ్
By: Tupaki Desk | 14 Jun 2021 10:30 AMఆయన వయసు 78. ఇంకా 18 వయసు కుర్రాడిలానే నిరంతరం యాక్టివ్ గా ఉంటారు. నటవృత్తిలోనే కాదు.. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు అభిమానులతో షేర్ లు.. వీటికి తోడు బ్లాగులు ఇన్ స్టా సోషల్ మీడియాల్లోనూ అంతే చురుగ్గా ఉంటారు. అసలు ఈ వయసులో ఆయనకు ఇంత ఎనర్జీ ఎలా వస్తోంది? అనేది పెద్ద ఫజిల్. ఆయన ఎవరో పరిచయం అవసరం లేదు. ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గురించే ఇదంతా.
ఈ ఏజ్ లో ఆయన ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీ షోలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంత బిజీలోనూ ఇతర షెడ్యూళ్లను అస్సలు విడువరు. ఇటీవల ఇన్ స్టాలో రెగ్యులర్ గా అమితాబ్ సెల్ఫీలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన సెట్స్ కి వెళ్తున్నప్పటి సెల్ఫీని షేర్ చేశారు. తన కారు నుండి సెల్ఫీ ని ఆయన పంచుకున్నాడు.
ఉదయం 7 గంటలకే ఆయన పని చేయడానికి స్వయంగా కార్ డ్రైవింగ్ చేస్తూ లొకేషన్ కి వెళ్లారు. లాక్ డౌన్ 2.0 తర్వాత మొదటి రోజు పాంగోలిన్ మాస్క్ ధరించి చిత్రీకరణకు జాయినయ్యారు. ఇటీవల COVID కేసులు స్థిరంగా పడిపోవడంతో జూన్ లో మహారాష్ట్రలో అన్ లాక్ దశ ప్రారంభమైంది. ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీలు ఆరుబయటకు స్వేచ్ఛగా వస్తున్నారు. షూటింగులకు బయల్దేరుతున్నారు. అమితాబ్ కూడా వెళ్లారు. ఇక గత ఏడాది జూలైలో వైరస్ బారిన పడిన అమితాబ్ బచ్చన్ ఈ ఏడాది మేలో తన రెండవ డోస్ COVID-19 వ్యాక్సిన్ ను తీసుకున్నారు.
కెరీర్ పరంగా చూస్తే..అమితాబ్ చివరిసారిగా షూజిత్ సిర్కార్ తెరకెక్కించిన గులాబో సీతాబోలో కనిపించారు. గత సంవత్సరం టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి 12 వ సీజన్ హోస్ట్ చేసారు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సహా ఓ స్పోర్ట్ డ్రామాలో కనిపించనున్నారు.