Begin typing your search above and press return to search.
50 నుంచి 100 వారాలు ఆడేవి.. క్లాసిక్ డే జ్ఞాపకాల్లోకి అమితాబ్!
By: Tupaki Desk | 16 April 2021 5:52 AM GMTరోజులు మారాయి. ఇప్పుడంతా డిజిటల్ యుగం.. యూట్యూబ్ ఓటీటీ సోషల్ మీడియాలదే రాజ్యం. సినిమా ఏదైనా థియేటర్లలో ఒక వారం అడితే గొప్పే. పైగా ఓటీటీల్లో లైక్ లు క్లిక్ లే ఆదరణకు రుజువులు. నాటితో పోలిస్తే నేడు మారిన ట్రెండ్ ని తలచుకుని బిగ్ బి అమితాబ్ చేసిన వ్యాఖ్యానం అందరినీ ఆలోచింపజేస్తోంది.
నాటి రోజుల్లో సినిమాలు 50 నుంచి 100 వారాలు ఆడేవి. డెబ్బైలలో అదే సంవత్సరంలో తన నుంచి దాదాపు అరడజను విడుదలలు ఎలా వచ్చాయో గుర్తుచేసుకున్నారు అమితాబ్.. ఆయన తన చిన్ననాటి త్రోబాక్ ఫోటోని ఇన్ స్టాలో పంచుకున్నారు. తెల్లటి టీ షర్టు ధరించి పెద్ద చంకీ రెట్రో సన్ గ్లాసెస్ తో అమితాబ్ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.
1970 లో 50 వారాలు 100 వారాలు ఆడేవి. తాను నటించినవి 6-7 సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదలయ్యేవి. డాన్.. కాస్మే వాడే.. త్రిశూల్.. ముకద్దర్ కా సికందర్.. గంగా కి సౌగంద్ మొదలైనవి 50 వారాల కంటే ఎక్కువ ఆడాయి. ఇప్పుడు OTT లు మిలియన్లు సక్సెస్ గ్రాఫ్ లు తయారుచేస్తాయి.. అని బుధవారం రాత్రి తాను పంచుకున్న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కి క్యాప్షన్ గా రాశారు.
రాబర్ట్ డి నిరో- అన్నే హాత్వే ప్రధాన పాత్రల్లో నటించిన 2015 హాలీవుడ్ హిట్ `ది ఇంటర్న్` హిందీ రీమేక్ లో తాను నటించనున్నట్లు బిగ్ బి అమితాబ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో దీపిక కీలక పాత్రను పోషిస్తుండగా `బదాయి హో` ఫేం అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.