Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ఫస్ట్ ఆడిషన్ ఫొటో ఇదే..
By: Tupaki Desk | 23 Feb 2016 5:52 AM GMTఅటు బాలీవుడ్లో.. ఇటు సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ గా ఎదిగిన కొందరు హీరోల నేపథ్యం చాలా సాధారణం. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, చిరంజీవి.. ఈ ముగ్గురూ కూడా సినిమాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో చాలా కష్టాలు పడ్డారు. అతి కష్టం మీద అవకాశాలు దక్కించుకున్నారు. అవకాశాలు అందుకున్నాక మాత్రం చెలరేగిపోయారు. ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగారు. ఏ కష్టం తెలియకుండా సినిమా అవకాశాలు దక్కించుకుని ఉంటే.. ఏ స్ట్రగుల్ లేకపోయి ఉంటే.. ఈ జర్నీ వాళ్లకు ఏమాత్రం మజాగా అనిపించేది కాదేమో. కష్టం తర్వాత వచ్చే సుఖంలో ఉండే కిక్కును ఈ ముగ్గరూ బాగా ఆస్వాదించారు. రజినీ, చిరుల కంటే కూడా కెరీర్ తొలి నాళ్లలో అమితాబ్ ఎక్కువ అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిన మాటల్ని బట్టి అందరికీ అర్థమైంది.
తాజాగా తనకు తొలి నాళ్లలో ఎదురైన చేదు అనుభవం గురించి సరదాగా గుర్తుచేసుకున్నారు బిగ్-బి. నిన్న ట్విట్టర్లో రెండు పాత ఫొటోలు పెట్టి.. వాటి గురించి వివరించారాయన. అమితాబ్ సూటేసుకుని ఉన్న ఫొటోలవి. ‘‘ఓ ట్యాలెంట్ హంట్ కోసం పంపితే.. తిరస్కరణకు గురైన నా ఫొటో ఇది. ఈ ఫొటోని చూశాక, అప్పట్లో వాళ్ళు నన్ను తిరస్కరించడం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదు కదూ’’ అని ఆయన చమత్కరించారు. ఐతే తనను రిజక్ట్ చేశాక పట్టుదల పెరిగిందని.. కోల్‌కతాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని, అవకాశాల కోసం పూర్తిగా ముంబయ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నానని అమితాబ్ చెప్పారు. ‘‘ముంబయిలో అడుగుపెట్టాక రాజేశ్ ఖన్నాని చూసినప్పుడు అలాంటివాళ్లుండగా మనలాంటివాళ్లకు అవకాశాలు రావనిపించింది. చాలా కష్టపడ్డాను. చివరికి 1968 ఫిబ్రవరి 15న ‘సాత్ హిందుస్తానీ’ సినిమా ఆడిషన్స్ కోసం రైటర్ కమ్ డైరెక్టర్ ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ ఆఫీసుకు వెళ్లాను. ఆ సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్స్ చేశారు. నన్ను సెలక్ట్ చేశారు. అలా నటుడిగా ఎంట్రీ దొరికింది. ఇది జరిగి 47 ఏళ్లు అయ్యింది’’ అని అమితాబ్ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.