Begin typing your search above and press return to search.
మెగాస్టార్ నయాలుక్.. గడ్డంకు బ్యాండ్
By: Tupaki Desk | 13 May 2019 3:40 PM ISTబాలీవుడ్ మెగాస్టార్ 75 ఏళ్లు దాటినా కూడా ఇంకా వరుసగా చిత్రాల్లో నటిస్తూనే ఉన్నాడు. అది కూడా ఏదో చిన్నా చితకా పాత్రల్లో కాకుండా సినిమాకు లీడ్ రోల్ లో ఆయన చేస్తూ వస్తున్నాడు. సంవత్సరంకు రెండు మూడు సినిమాలు తీసుకు వస్తున్న అమితాబచ్చన్ అందులో ఎక్కువ శాతం సక్సెస్ శాతంను కలిగి ఉంటున్నాడు. తాజాగా ఈయన రూమీ జాఫ్రీ దర్శకత్వంలో 'చెహ్రే' అనే చిత్రంను చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. షూటింగ్ ప్రారంభం సందర్బంగా ఈ చిత్రంలోని తన లుక్ ను రివీల్ చేశాడు. చాలా విభిన్నమైన పాత్ర ఇదని, అమితాబచ్చన్ మరోసారి ఈ చిత్రంతో సక్సెస్ దక్కించుకోవడం ఖాయం అంటూ లుక్ చూస్తే అర్థం అవుతోంది.
ఈ చిత్రంలో అమితాబచ్చన్ పాత్ర గడ్డం బారుగా పెంచుకుని, గడ్డంకు రబ్బర్ బ్యాండ్ వేయడం ఫస్ట్ లుక్ లో చూడవచ్చు. ఇలాంటి లుక్ బచ్చన్ జీ గతంలో ట్రై చేయలేదు. ఎన్నో భిన్నమైన, విభిన్నమైన పాత్రల్లో నటించిన అమితాబచ్చన్ చిత్ర విచిత్రమైన గెటప్స్ లో కనిపించాడు. అయితే ఈసారి మాత్రం చాలా భిన్నంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ ను చూస్తుంటే అనిపిస్తుంది.
బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ భాస్కర్ 'చెహ్రే' సినిమాకు సంబంధించిన అమితాబ్ లుక్ ను పోస్ట్ చేశాడు. ఈ చిత్రంలో అమితాబచ్చన్ తో పాటు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రంలో కృతి కర్బందా, రియా చక్రవర్తి, సిద్దాంత్ కపూర్, ద్రిత్ మాన్ చక్రవర్తి, రఘు వీర్ యాధవ్ లు నటిస్తున్నారు. షూటింగ్ చాలా సజావుగా సాగుతుందని జాఫ్రీ చాలా ఉత్సాహంగా ఉన్నట్లుగా అమితాబచ్చన్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.