Begin typing your search above and press return to search.
మెగాస్టార్ డెసిషన్.. మనోళ్ళు తీసుకుంటారా?
By: Tupaki Desk | 2 March 2017 11:30 AM GMTఒక పెద్ద టాప్ హీరో సంపాదించే ఆస్తి విలువ ఎంత ఉంటుంది? తెలుగులో అయితే హేమాహేమీలు అందరూ 1000 కోట్లకు పైనే సంపాదించారు. పైగా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టు చేయడంతో వీరికి బాగానే గిట్టుబాటైంది. ఇప్పుడు వీరందరికీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెబుతున్న మాటను ఓసారి గుర్తుచేద్దాం.
గత రాత్రి జండర్ ఈక్వాలిటీ (ఆడ మగా ఇతరుల సమానత్వం) గురించి మాట్లాడిన బిగ్ బి.. తన ఆస్తిని తన కూతురుకూ తన కొడుక్కూ సగం సగం పంచుతానంటూ కామెంట్ చేశారు. మామూలుగా అయితే కూతురికి పెళ్ళిలో ఇచ్చే ఆస్తులే తప్పించి.. ఇతర ఆస్తులను ఇవ్వరు. బడా బడా బాబులు కూడా కట్నాలు ఇచ్చేసి.. కూతురు టాపిక్ ఈజ్ ఓవర్ అనుకుంటారు. కష్టపడి కూడబెట్టిందంతా కొడుక్కు చెందాలనే అనుకుంటారు. కాని ఇది అమానుషం. కొడుకు అంటే మన వంశాన్ని వృద్దిచేసేవాడు కాబట్టి అతనికి ఆస్తిని ఇచ్చి.. కూతురుకు సరైన వాటా ఇవ్వకపోతే.. అది తప్పే కదా? నైతికంగా పెద్ద తప్పే. అందుకే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అలా కామెంట్ చేశారు.
మరి మన తెలుగు స్టార్లు ఎవరైనా ఇదే విధంగా నా ఆస్తి అంతా నా పిల్లలందరికీ సమానంగా ఇస్తాను అంటారా? జెండర్ ఈక్వాలిటిపై నోరు మెదుపుతారా? మెగాస్టార్ అమితాబ్ రేంజులో డెసిషన్ తీసుకుంటారా? చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/