Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ తో ఆర్జీవీ మూవీ కన్ఫర్మ్‌ అయ్యిందట..!

By:  Tupaki Desk   |   16 Jun 2022 5:30 AM GMT
మెగాస్టార్‌ తో ఆర్జీవీ మూవీ కన్ఫర్మ్‌ అయ్యిందట..!
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య కాలంలో వరుసగా తెలుగు లో సినిమాలు చేస్తున్నాడు. అందులో ఎన్ని విడుదల అవుతున్నాయి అనేది కూడా క్లారిటీ ఉండటం లేదు. డేంజరస్‌ తో పాటు మరో రెండు మూడు సినిమాలు విడుదలకు ఉండగానే కొండా అనే సినిమాను మొదలు పెట్టిన వర్మ ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయిన విషయం తెల్సిందే.

కొండా సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ తన తదుపరి సినిమాల విషయమై ఇంట్రెస్టింగ్‌ వ్యాక్యలు చేశాడు. తెలుగు లోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా ఒక భారీ సినిమాను చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. వర్మ కు అమితాబ్ బచ్చన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు వర్మ అడిగినా బచ్చన్ కాదు అనకుండా డేట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు.

అందుకే బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వర్మ సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అమితాబ్‌ తో ఒక హర్రర్ సినిమాను చేసేందుకు రెడీ అయ్యానంటూ వర్మ ప్రకటించాడు.

ఈ ఏడాది నవంబర్ లో అమితాబ్ డేట్లు ఇచ్చినట్లుగా వర్మ తెలియజేశాడు. నవంబర్‌ లో సినిమాను ప్రారంభించి తక్కువ సమయంలోనే పూర్తి చేసి వచ్చే సంవత్సరం సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ గతంలో అమితాబ్‌ తో చేసిన సినిమా లో ఇండస్ట్రీ హిట్స్.. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. బిగ్‌ బి అమితాబ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ కేవలం వర్మ వల్లే నిలిచింది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం బచ్చన్‌ సాబ్‌ ఈ స్థాయిలో బిజీగా ఉన్నాడు అంటే వర్మ నే ఒకింత కారణం అనే వారు లేకపోలేదు. అందుకే ఆర్జీవీ తో బచ్చన్ సినిమా కు ఎప్పుడూ కూడా రెడీగానే ఉంటాడు.

మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ మరియు వర్మ కాంబోలో సూపర్‌ హిట్స్ మాత్రమే కాకుండా అట్టర్‌ ప్లాప్స్ కూడా ఉన్నాయి. కనుక ఇప్పుడు వర్మ చేయబోతున్న హర్రర్‌ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. వర్మ ఈమద్య కాలంలో సినిమాలను సీరియస్ గా తీయడం లేదని... ఆయన టైమ్‌ పాస్ కోసం లేదా ఏదో వివాదం కోసం అన్నట్లుగా తీస్తున్నాడు అనే విమర్శలు ఉన్నాయి. కనీసం బిగ్‌ బి తో అయినా సీరియస్ గా సినిమా ను చేస్తాడేమో చూడాలి.