Begin typing your search above and press return to search.

77ఏళ్ల వయసులో మనవడితో కలిసి వర్కౌట్స్ చేస్తున్న బిగ్ బి...!

By:  Tupaki Desk   |   22 May 2020 5:30 AM GMT
77ఏళ్ల వయసులో మనవడితో కలిసి వర్కౌట్స్ చేస్తున్న బిగ్ బి...!
X
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి నవ్యా నవేలి నందా అగస్త్య నందా ఆరాధ్య బచ్చన్ అనే మనవడు మనుమరాలు ఉన్న విషయం తెలిసిందే. వీరికి సంభందించిన విషయాలు సోషల్ మీడియా ద్వారా అమితాబ్ షేర్ చేస్తూనే ఉంటాడు. వారితో కలిసి చేసే అల్లరి.. మనవడితో కలిసి జిమ్ వర్కౌట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇటీవల కాలంలో అమితాబ్ బచ్చన్ ఎక్కువగా జిమ్ లో సమయాన్ని గడుపుతున్నాడు. అలాగే తాను చేస్తున్న వ్యాయామానికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేందుకు ఈ బాలీవుడ్ సూపర్ సీనియర్ హీరో తన ఇంట్లోనే ఏర్పాటు చేసిన జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు. అలాగే తన అభిమానులు కూడా వ్యాయామం చేయాలని చెబుతున్నాడు. తాజాగా తాను తన కుమార్తె శ్వేతా బచ్చన్ నంద కుమారుడైన అగస్త్య నందాతో కలసి ఒక ఫోటో దిగి ఆ ఫోటోని బిగ్ బి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

"ఫైట్... ఫిట్నెస్ కోసం ఫైట్ చేయండి... నా మనవడిని చూసి ఇన్స్పైర్ అవుతున్నాను'' అని పేర్కొన్నాడు. ఈ ఫోటోలో అమితాబ్ బచ్చన్, అగస్త్య నంద ఇద్దరు నిల్చొని డంబెల్స్ పట్టుకొని ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఈ జిమ్ వర్క్ అవుట్ లో స్లీవ్ లెస్ పైజామా ధరించి ఉన్నాడు. దీనికంటే ముందు అమితాబ్ బచ్చన్ ఫ్రీ వర్కౌట్ సెల్ఫీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో అమితాబ్ సీరియస్ గా గర్జిస్తున్నట్లు ఫోజ్ ఇవ్వగా మనవడు అగస్త్య నందా మాత్రం స్మైల్ ఇస్తున్నాడు. దీనిని బట్టి చూస్తే అమితాబ్ కి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని అర్థం అవుతోంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫిట్ నెస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 77ఏళ్ల వయసులో కూడా ఫిట్ గా అమితాబచ్చన్ ఉండటం ప్రస్తుతం అందరికి స్ఫూర్తినిస్తోంది. తన ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో అమితాబ్ బచ్చన్ కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే స్వీకరిస్తాడు. ఈ వయసులో బరువులు ఎత్తుతూ ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తున్న బిగ్ బీ ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ - ఆయుష్మాన్ ఖురానా నటించిన 'గులాబో సితాబో' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. అంతే కాకుండా 'జుండ్' 'చేహరే' 'బ్రహ్మాస్త' సినిమాలలో నటిస్తూ ఈ వయసులో కూడా అలుపెరగకుండా పని చేస్తున్నాడు అమితాబ్.