Begin typing your search above and press return to search.

వాళ్ళ అప్పులు తీర్చేసిన మెగాస్టార్ !

By:  Tupaki Desk   |   12 Jun 2019 11:36 AM GMT
వాళ్ళ అప్పులు తీర్చేసిన మెగాస్టార్ !
X
కొంద‌రంతే.. కార‌ణ‌జ‌న్ముల‌ని ఊరికే అన‌రు. కార‌ణం ఏమైనా కానీ.. క‌ష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాల‌న్నఆలోచ‌న ప్ర‌ముఖుల‌కు కొంద‌రికి వ‌స్తుంటుంది. అందుకోసం వారు విప‌రీతంగా శ్ర‌మిస్తుంటారు.తాజా ఉదాహ‌ర‌ణ అలాంటిదే. బాలీవుడ్ న‌ట దిగ్గ‌జం.. సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కు చెందిన ఈ వార్త చ‌దివితే ఆయ‌న మీద గౌర‌వం మ‌రింత పెర‌గ‌టం ఖాయం.

వ్య‌వ‌సాయం చేసి అప్పులపాలు అయిన బ‌క్క‌రైతుల బాధ‌ల్ని.. వెత‌ల్ని తీర్చేందుకు అమితాబ్ ముందుకు వ‌చ్చారు. అప్పులు తీర్చ‌లేని స్థితిలో ఉన్న రైతుల అప్పులు తీర్చారు. అది కూడా ప‌ది మందో..యాభై మందో కాదు.. ఏకంగా 2100 మంది రైతుల అప్పులు తీర్చిన ఆయ‌న ఆద‌ర్శంగా నిలిచారు.
బిహార్ కు చెందిన 2100 మంది రైతుల అప్పులు తీరుస్తాన‌ని.. వారి బాధ్య‌త‌లు తాను తీసుకుంటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న తాజాగా 2100 మంది రైతుల‌కు సంబంధించిన అప్పుల్ని తీర్చేశారు. కొంద‌రి అప్పులు తీర్చేయ‌గా.. మ‌రికొంద‌రి అప్పుల మొత్తాన్ని వారి ఖాతాల్లో వేసిన‌ట్లుగా పేర్కొన్నారు. గ‌తంలోనూ అప్పుల బారిన ప‌డిన రైతుల్ని ఆదుకున్నారు బిగ్ బి.

సినిమాల్లో రైతుల క‌ష్టాల మీద సొమ్ము చేసుకునే స్టార్ హీరోలు.. బిగ్ బి దారిన న‌డిచే అవ‌కాశం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. టాలీవుడ్ లోనూ తోపుల్లాంటి న‌టులు ఉన్నారు. బ‌క్క‌జీవుల క‌ష్టాల్ని తీర్చి స్ఫూర్తివంతంగా నిలిస్తే.. మ‌రికొంద‌రు వారి బాట న‌డ‌వ‌టానికి అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పాలి.