Begin typing your search above and press return to search.

సైరా.. మెగాస్టార్ లుక్ వచ్చేసిందిగా

By:  Tupaki Desk   |   29 March 2018 6:32 AM GMT
సైరా.. మెగాస్టార్ లుక్ వచ్చేసిందిగా
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైద్రాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో వేసిన సెట్స్ లో షూటింగ్ నిర్వహిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరో అయితే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

ఇప్పుడు బిగ్ బీ కూడా సైరా షూటింగ్ కు వచ్చేశారు. ఇప్పటికే ఒక రోజు షూటింగ్ కూడా పూర్తయిపోయింది. మరో రోజు కూడా షూటింగ్ కంటిన్యూ చేయనున్నారు. తొలి రోజు షూట్ పూర్తి కాగానే.. తన లుక్ ని రివీల్ చేసేశారు అమితాబ్ బచ్చన్. సైరా మూవీలో చిరంజీవికి గురువు పాత్రలో అమితాబ్ కనిపించనున్నారనే సంగతి ఈ లుక్ ను చూస్తే అర్ధం అవుతుంది. ఈవిషయాన్ని దాచిపెట్టే ఉద్దేశ్యం సైరా యూనిట్ కు లేదు. అందుకే ఇలా బిగ్ బీ లుక్ ను ఆయనతోనే రివీల్ చేయించారని అంటున్నారు. ఇద్దరు మెగాస్టార్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు.

సైరా మూవీకి ప్రస్తుత షెడ్యూల్ ఫుల్ లెంగ్త్ గా పూర్తి కాకుండానే.. అమితాబ్ బచ్చన్ లుక్ ను విడుదల చేయించడం వెనుక.. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా క్రేజ్ తీసుకురావాలనే వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ లో సౌత్ టాప్ బ్యూటీ నయనతార కూడా షూటింగ్ లో పాల్గొంటోంది.