Begin typing your search above and press return to search.

అతడి పాడె మోసిన మెగాస్టార్‌ కు హ్యాట్సాఫ్‌

By:  Tupaki Desk   |   27 Jun 2019 2:27 PM GMT
అతడి పాడె మోసిన మెగాస్టార్‌ కు హ్యాట్సాఫ్‌
X
సినీ తారలు కోట్లలో సంపాదిస్తూ ఉంటారు. సంపాదించిన సంపదలో కొంత మొత్తంను సేవ కార్యక్రమాలకు కొందరు వినియోగిస్తారు. అలాంటి గొప్ప మనసున్న మహారాజు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా.. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసినా కూడా అమితాబచ్చన్‌ తనవంతు సాయం చేసేందుకు ముందు ఉంటాడు. రైతుల రుణాలు కట్టడం.. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సాయం చేయడం ఇంకా ఎన్నో రకాలుగా బిగ్‌ బి సేవా కార్యక్రమాలు చేయడం మనం చూశాం.

తాజాగా అమితాబచ్చన్‌ మరోసారి తన మంచితనంను చూపించాడు. తన వద్ద 40 ఏళ్ల పాటు సెక్రటరీగా ఉద్యోగం చేసిన శీతల్‌ జైన్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన మరణ వార్తతో తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన అమితాబచ్చన్‌ అంతిమ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. శీతల్‌ జైన్‌ పాడె కూడా మోసిన అమితాబచ్చన్‌ ఆయన రుణం తీర్చుకున్నాడు.

అమితాబ్చన్‌ తో పాటు ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా శీతల్‌ జైన్‌ పాడె మోయడం జరిగింది. అమితాబ్‌ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైన శీతల్‌ జైన్‌ ఒక సాదారణ ఉద్యోగి. అయినప్పటికి బిగ్‌ బి ఫ్యామిలీ మొత్తం ఆయనకు ఘన నివాళ్లు అర్పించారు. ఈనెల ఆరంభంలో ఈ సంఘటన జరిగింది. కాస్త లేట్‌ గా వెలుగులోకి వచ్చిన ఈ ఫొటో వైరల్‌ అయ్యింది. బిగ్‌ బి గొప్పతనంకు ఇది మరో నిదర్శనం అని, తన సెక్రటరీ మరణిస్తే ఆయన పాడె మోసిన అమితాబ్‌ కు హ్యాట్సాఫ్‌ అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున అమితాబ్‌ పై ప్రశంసలు కురుస్తున్నాయి.