Begin typing your search above and press return to search.

వామ్మో... ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ మూవీ రెమ్యూనరేషన్స్‌

By:  Tupaki Desk   |   15 Oct 2020 2:30 AM GMT
వామ్మో... ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ మూవీ రెమ్యూనరేషన్స్‌
X
రాధేశ్యామ్‌ తర్వాత ప్రభాస్‌ చేయబోతున్న రెండు సినిమాలు కన్ఫర్మ్‌ అవ్వడంతో పాటు అధికారికంగా అనౌన్స్‌ మెంట్‌ కూడా వచ్చేశాయి. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్నాయి. రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు సినిమాలు కూడా బాలీవుడ్‌ స్టార్స్‌ తో కళకళలాడబోతున్నాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీలో ఇప్పటికే దీపిక పదుకునే నటిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఇటీవల ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో నటించబోతున్నందుకు గాను అమితాబచ్చన్‌ కు ఏకంగా 25 కోట్ల పారితోషికం ఇస్తున్నారట. సినిమాలో ఆయన 30 నిమిషాలకు అటు ఇటుగా కనిపిస్తాడు. ఆయనతో 30 నుండి 40 రోజుల పాటు షూటింగ్‌ చేస్తారట. అందుకు గాను ఏకంగా పాతిక కోట్ల పారితోషియం ఇస్తున్నారు అంటే సినిమాలో ఇతర స్టార్స్ అయిన ప్రభాస్‌ మరియు దీపిక పదుకునేలా పారితోషికాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

ఈ ముగ్గురు కాకుండా ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కూడా నటించే అవకాశం ఉంది. ఇక హాలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ ను ఈ సినిమాకు వర్క్‌ చేయబోతున్నారు. వీరి మొత్తం పారితోషికం కలిపితే ఏకంగా 150 నుండి 175 కోట్ల వరకు అయ్యేలా ఉందనిపిస్తుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.