Begin typing your search above and press return to search.

అరవింద సమేతలో సర్ ప్రైజ్ షాక్ ?

By:  Tupaki Desk   |   10 Sept 2018 6:42 PM IST
అరవింద సమేతలో సర్ ప్రైజ్ షాక్ ?
X
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ తిరిగి వేగమందుకుంది. హరికృష్ణ గారి అకాల మరణంతో కొద్దిరోజులు బ్రేక్ పడినా ఇంకా వాయిదా వేస్తే నిర్మాత మొదలుకుని బయ్యర్ల దాకా అందరు ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉండటంతో కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ప్రకటించనప్పటికీ ఈ క్రేజీ మూవీ అక్టోబర్ 11న రావడం దాదాపు ఖాయమే. ఆడియో లేదా ప్రీ రిలీజ్ త్వరలోనే చేయబోతున్న నేపధ్యంలో అదే వేదిక మీద తేదీని అధికారికంగా అభిమానుల సమక్షంలో చెప్పబోతున్నారు. ముందు వెనుకా ఇతర సినిమాల విడుదల పక్కాగా ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో డేట్ లో మార్పు ఉండే అవకాశం దాదాపు లేనట్టే. తమన్ స్వరపరిచిన ట్యూన్స్ కు ఎన్టీఆర్ స్టెప్స్ వేయటం కూడా ఈ షెడ్యూల్ లోనే జరగనుంది. ఇదిలా ఉంచితే ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్ డేట్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది నిజమేనా అనే నిర్ధారించే అవకాశం ఇప్పటికిప్పుడు లేదు కానీ త్వరలోనే తేలిపోతుంది.

దాని ప్రకారం అరవింద సమేత వీర రాఘవలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక స్పెషల్ క్యామియోలో కనిపిస్తారట. అది ఎంత వ్యవధి ఏ సందర్భంలో అని తెలిసే అవకాశం లేదు కానీ ఇది పుకారా లేక ఖరారా అనేది ఇప్పుడే చెప్పలేం. సైరాలో చిరంజీవి గురువుగా ఒక కీలక పాత్ర చేస్తున్న అమితాబ్ సౌత్ సినిమాల్లో అలా మెరుపులా కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. మనంలో నాగార్జున ఫామిలీ డాక్టర్ గా తళుక్కున మెరిస్తే అంతకు ముందు కొన్నేళ్ల క్రితం ఓ కన్నడ సినిమాలో కూడా కొన్ని నిమిషాల పాటు కనిపించారు. ఇటీవలే ఎస్ జె సూర్య హీరోగా రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో ఇలాంటి క్యామియోకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో అరవింద సమేతలో కనిపించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఇది నిజమో కాదో ఎలాగూ మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది కాబట్టి అంత వరకు వేచి చూడాల్సిందే.