Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కు ముచ్చటేసిన ఆ ఫోటో

By:  Tupaki Desk   |   19 April 2017 4:37 AM GMT
మెగాస్టార్ కు ముచ్చటేసిన ఆ ఫోటో
X
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఈ పేరు లోనే ఉంది బాలీవుడ్ గాంభీర్యం. అందుకే అందరు షార్ట్ కట్ లో బిగ్ బి అని పిలుస్తారు. ఈ మధ్య అమితాబ్ చేసిన సినిమాలు మనం చుస్తే అతని లో ఉన్న యాంగ్రీ యంగ్ ఆర్టిస్ట్ ఇంకా అలాగే గా ఉన్నాడు అని చెప్పక తప్పదు. పీకు.. పింక్ లాంటి సినిమా లో ఆయన నటన యువ నటులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయ్.

ఈ మధ్య ఒక ఫంక్షన్ లో అమితాబ్ కూతురు శ్వేత నంద మరియు సెక్సీ హీరోయిన్ కత్రినా కైఫ్ కలిసి చాలా ఆప్యాయంగా మాటలు ఆడుకున్నారు. అక్కడే ఉన్న మన బిగ్ బి సదరు సీన్ ను ఒక క్లిక్ చేసాడు. ఆయన సోషల్ మీడియా లో చాల ఆక్టివ్ గా ఉంటారు కదా.. దానికితోడు రోజూ ట్వీట్లు వేస్తారాయే. ఇదే పనిలో భాగంగా ఆయన క్లిక్ చేసిన ఫోటోను తను ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తూ ''ఎందుకో ఈ ఫోటో చుస్తే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది'' అని చెప్పారు. చూస్తుంటే కత్రినా ఆయనకు ఎక్కడో వ్యక్తిత్వ పరంగా బాగా నచ్చినట్లుంది. లేకపోతే బిగ్ బి ఇలాంటి స్టేట్మెంట్లు ఎవ్వరి గురించీ ఇవ్వరు.

అమితాబ్ ఇప్పుడు స్టార్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి నటించబోతున్నారు. ''థగ్స్ అఫ్ హిందోస్తాన్'' అనే సినిమా లో మనకు ఇద్దరు టెరిఫిక్ నటులను కలిపి ఒకేసారి చూపించబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/