Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఫ్యామిలీ ఎంత హాటో!!

By:  Tupaki Desk   |   7 Aug 2017 4:51 AM GMT
మెగాస్టార్ ఫ్యామిలీ ఎంత హాటో!!
X
సినిమా హీరో ఫ్యామిలి అంటే అందరికి ఆసక్తి ఉంటుంది. అందులోనూ భార్య భర్త కొడుకు కోడలు అందరూ సినిమా నటులైతే ఇంకా అటువంటి ఫ్యామిలి పై జనాలు మరేంత ఆసక్తి చూపిస్తారో కదా. ఇండియాలోనే ఎక్కువ మంది నటులు ఉన్న ఫ్యామిలి అంటే అందరికి గుర్తుకు వచ్చేది కపూర్ ఫ్యామిలినే కదా. ఆ తరువాత స్థానం మాత్రం బచ్చన్ ఫ్యామిలి అనే చెప్పాలి. ఈ మధ్య అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ తన కూతురు మనవరాలుతో కలిసి ఒక ఫోటో షూట్ చేసింది. ఫ్యామిలీ ఫ్యామిలీ లేడీస్ అంతా హాటుగానే ఉన్నారని చెప్పాలి

వోగ్ మ్యాగజైన్ కోసం ఈ మూడు తారలు చేసిన ఫోటో షూట్ ఇప్పుడు బాలీవుడ్ అంత సూపర్ అని తెగ మెచ్చుకుంటున్నారు. కూతురు శ్వేతా నందా అప్పుడప్పుడూ ఫ్యాషన్ వాక్లు తన నాన్న - తమ్ముడుతో చేసినా కూడా అమ్మతో మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంది. ఈ ఫోటో షూట్ లో హైలైట్ ఎవరు అంటే మనవరాలు నవ్య నవేలి ఇంకా అమ్మమ్మ జయా బచ్చన్ అని చెప్పక తప్పదు. తన హుందాతనాన్ని తనలో ఉండే అమాయకత్వాన్ని అందంగా చూపించిది జయా బచ్చన్. కూతురుని - మనవరాలను ప్రేమగా తన ఒడిలోకి తీసుకుంటూ వాళ్ళతో ఫ్యాషన్ ఫోటో షూట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. కాకపోతే అస్సలు ఎవ్వరూ ఊహించని రీతిలో మెగాస్టార్ కూతురు క్లీవేజ్ షో తో షాకిచ్చేసింది.

వోగ్ మ్యాగజైన్ ఈ ఆగష్టు కోసం ఈ మూడు తరాల అందాలును ఒక్క చోట పెట్టి వారి మధ్య ఉండే అనుబంధాలను బచ్చన్ అభిమానులుతో పాటుగా బాలీవుడ్ అభిమానులు ముందు ఉంచబోతున్నారు. ఈ ఫోటో షూట్ లో ఒకరి తో ఒకరు ఉన్న పోజ్లు చూస్తేనే అర్ధం అవుతుంది వాళ్ళు ఒకరితో ఒకరు ఎంత అనుబంధంగా ఉంటారో అని. ఏది ఏమైనా ఈ ఫోటో షూట్ తో వాళ్ళ అనుబంధంతో అభిమానులును మాయ చేశారు అనే చెప్పవచ్చు. అమితాబ్ బచ్చన్ మనవరాలు సినిమా హీరోయిన్ అవ్వబోతుంది అనే టాక్ కూడా ఈ మధ్య వినిపిస్తుంది.