Begin typing your search above and press return to search.
ఇండియాకి మరీ అలాంటి పేరుందా బిగ్ బీ?
By: Tupaki Desk | 17 Sep 2016 6:52 AM GMTభారతదేశం గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అంటే.. ముందుగా ఇక్కడున్న సంస్కృతి - సంప్రదాయాలు, పద్దతుల గురించి చెబుతారు అని అంతా అనుకుంటున్న దశలో.. భారతదేశాన్ని "ల్యాండ్ ఆఫ్ రేప్స్"గా పిలుస్తున్నారని బాంబ్ పేల్చారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. తాను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడివారు ఇండియాని ఇదే పేరుతో పిలుస్తున్నారని, ఆ విషయం తనకు చాలా ఆవేదన కలిగిస్తోందని అమితాబ్ చెబుతున్నారు.
శుక్రవారం విడుదలయిన "పింక్" మూవీ కి పాజిటివ్ టాక్ రావడంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అమితాబ్.. తాజాగా భారతదేశం - మహిళలు - అభివృద్ధి వంటి అంశాలపై స్పందించారు. దేశంలో ప్రతీ ప్రాంతంలోని మహిళలు భద్రంగా ఉండాలని - ప్రాంతాలతో ప్రమేయం లేకుండా మహిళలకు రక్షణ అవసరమని.. ఈ విషయంలో ఢిల్లీ కంటే ముంబై చాలా సేఫ్ అని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. భారత్ ను థర్డ్ క్లాస్ కంట్రీగా గానీ - అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగాగానీ పిలవడం తనకు ఇష్టం ఉండదని... ప్రథమ శ్రేణి దేశంగా - అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని అమితాబ్ పిలుపునిచారు. ఈ సందర్భంగా అమ్మాయిల కన్యత్వం గురించి స్పందించిన అమితాబ్... సమాజంలో యువతుల కన్యత్వం గురించి ప్రశ్నిస్తున్నప్పుడు పురుషుల శీలం గురించి కూడా చర్చించాల్సి ఉంటుందని.. ఈ విషయంలో ఎవరైనా ఒకటేననీ అన్నారు.
కాగా... అమితాబ్ - తాప్సీ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కి శుక్రవారం విడుదలయిన పింక్ సినిమాలో మానసిక వ్యాధితో బాధపడే లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు అమితాబ్. లాయర్ గా బిగ్ బీ పవర్ ఫుల్ డైలాగులు పేల్చారు.