Begin typing your search above and press return to search.

ప్రభాస్ హీరోయిన్ పై అమితాబ్ కామెంట్.. నెట్టింట వైరల్!

By:  Tupaki Desk   |   27 March 2021 9:36 AM IST
ప్రభాస్ హీరోయిన్ పై అమితాబ్ కామెంట్.. నెట్టింట వైరల్!
X
తెలుగు ఇండస్ట్రీకి 'వన్.. నేనొక్కడినే' సినిమాతో పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఫస్ట్ సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించేసరికి క్రేజ్ అయితే వచ్చింది కానీ హిట్టు మాత్రం పడలేదు. తెలుగులో కృతి చేసింది రెండే సినిమాలు. నేనొక్కడినే తర్వాత అమ్మడు నాగచైతన్య సరసన 'దోచేయ్' సినిమా చేసింది. అంతే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కృతి వెంటనే బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన హీరోపంటి సినిమాతో డెబ్యూ చేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుసగా వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోయింది. మంచి హిట్స్ పడటంతో ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది.

ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ జంటగా ఆదిపురుష్ సినిమాలో సీతగా ఎంపికైంది. ప్రస్తుతం ఆ సినిమాతో పాటు పలు క్రేజీ సినిమాలను అమ్మడు చేతిలో కలిగిఉంది. ఇదిలా ఉండగా.. కృతికి సోషల్ మీడియా ఖాతాల్లో నాలుగు కోట్లవరకు ఫాలోయర్స్ ఉన్నారు. అందుకే అమ్మడు ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా కృతి ఓ గ్లామరస్ పిక్ పోస్ట్ చేసింది. మోడరన్ మాక్సీ డ్రెస్ లో కృతి మిలమిలా మెరిసిపోయింది. అలాగే అందాలను కూడా అదే రేంజిలో ఆరబోసింది. ఫ్యాన్స్ కళ్ళప్పగించి చూస్తూ లైక్స్ కొడుతున్నారు. అయితే ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా కృతి అందం చూసి స్పందించడం విశేషం. అందులోను బిగ్ బి అమితాబ్ స్పందించి కామెంట్ చేస్తే.. అదికూడా 'వావ్.. అని ఓ లవ్ సింబల్' పెడితే.. ఎక్సపెక్ట్ చేయలేరు కదా.. కానీ అదే జరిగింది. అమితాబ్ కామెంట్ చేయడంతో కృతి అందం మరింత రెట్టింపు అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.