Begin typing your search above and press return to search.
ఇండియాలో మొట్ట మొదటి మెగాస్టార్
By: Tupaki Desk | 11 Oct 2019 7:28 AMభారతదేశంలో మొట్ట మొదటి మెగాస్టార్ ఎవరు? అంటే.. స్టార్లు అంతా .. ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ పేరునే సూచిస్తుంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్.. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి.. ఇలా లెజెండ్స్ అంతా అమితాబ్ ని గురుతుల్యుడిగా భావిస్తారు. కేవలం వీళ్లకే కాదు ఎందరో స్టార్లకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక మెగా స్ఫూర్తి. అందుకే ఆయనను దేశంలో తొలి మెగాస్టార్ అని కీర్తించాల్సి ఉంటుంది.
తరచి చూస్తే.. అమితాబ్ జీవితం అంతే స్ఫూర్తివంతం. బిగ్ బిగా.. బాద్ షాగా.. బాలీవుడ్ మెగాస్టార్ గా గొప్ప స్థానాన్ని అందుకున్న అమితాబ్ జీ గొప్ప స్టార్ మాత్రమే కాదు.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అన్నిటినీ ఎదిరించి తన స్థానాన్ని కాపాడుకున్న గొప్పవాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పెద్ద స్టార్ గా ఓ వెలుగు వెలిగి ఫ్లాపులతో జీరోకి పడిపోయారు. కెరీర్ పరంగా తీవ్రమైన డైలెమాని ఎదుర్కొని.. ఉన్న ఆస్తుల్ని కోల్పోయి చివరికి ఏం జరుగుతోందో తెలియని సన్నివేశం నుంచి ఆయన బయటపడ్డారు. కేబీసీ బుల్లితెర కార్యక్రమంతో తిరిగి రీబూట్ అయ్యారు అమితాబ్. వీటన్నిటినీ మించి దాదాపు పాతికేళ్ల పాటు టీబీ లాంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యను ఎదుర్కొని... లివర్ సిర్రోసిస్ కి మందులు మింగుతూ అనారోగ్యంతో పోరాడుతూనే ఆయన ఎన్నిటినో సాధించారు. ఇప్పటికీ నవయువకుడిలా ఆయన క్షణం తీరిక లేకుండా నటిస్తూ బిజీగా ఉన్నారు. పైగా ఏ ఇతర స్టార్ కి సాధ్యం కాని రీతిలో తన అభిమానులతో నిరంతరం సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో విషయాల్ని షేర్ చేసుకుంటున్నారు.
నేటితో అమితాబ్ 77వ వసంతంలోకి అడుగు పెట్టారు. 77 వయసులోనూ 24 మైండ్ సెట్ ఉన్న నవయుకుడిగా అమితాబ్ జీని అభిమానులు ప్రశంసిస్తుంటారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా-నరసింహారెడ్డి చిత్రంలో అతిధి పాత్రలో నటించారు అమితాబ్. అందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అద్భుతమైన ఆహార్యంతో మైమరిపించారు. ఇక అమితాబ్ జీ రాజకీయాల్లో ప్రయత్నించినా అవి తనకు సూట్ కావని తిరిగి నటుడిగానే కొనసాగుతూ.. నటనే జీవిత పరమావధిగా కెరీర్ ని సాగిస్తున్నారు.