Begin typing your search above and press return to search.

అపరిచితుడి బండి ఎక్కిన మెగాస్టార్‌.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   15 May 2023 4:22 PM
అపరిచితుడి బండి ఎక్కిన మెగాస్టార్‌.. ఎందుకో తెలుసా?
X
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ.. షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు కమర్షియల్ యాడ్స్ తో రెగ్యులర్ గా కెమెరా ముందు ఉంటున్న విషయం తెల్సిందే.

తాజాగా ముంబయి రోడ్ల పై ట్రాఫిక్ కారణంగా అమితాబ్ ఇబ్బంది పడ్డరు. ఒక షూటింగ్‌ కు అర్జంట్ గా వెళ్లాల్సి ఉండగా అమితాబచ్చన్‌ ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ లో చిక్కుకుంది. దాంతో కారు దిగిన అమితాబచ్చన్‌ స్వయంగా రోడ్డు పై వెళ్తున్న అపరిచితుడిని లిఫ్ట్‌ అడిగి మరీ షూటింగ్ లొకేషన్‌ కి చేరుకున్నారు.

ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా అమితాబచ్చన్ ఆ అపరిచితుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్స్‌ రైడ్ బడ్డీ. మీరు ఎవరో నాకు తెలియదు. కానీ ట్రాఫిక్ లో చిక్కుకున్న నన్ను షూటింగ్ లొకేషన్‌ కి సమయానికి చేర్చారు అంటూ అమితాబచ్చన్ పేర్కొన్నారు.

అమితాబచ్చన్‌ ఈ మధ్య కాలంలో సౌత్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. చిరంజీవి తో సైరా సినిమాలో నటించిన అమితాబచ్చన్ ప్రస్తుతం తెలుగు లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ వయసులో కూడా ఒకే సారి నాలుగు అయిదు సినిమాలు చేస్తూ ఎంతో మందికి బిగ్ బి ఆదర్శంగా నిలుస్తున్నారు.