Begin typing your search above and press return to search.

ఎగిరే గాలిపటంలా లైఫ్ సెల‌బ్రేష‌న్ ఇలా

By:  Tupaki Desk   |   3 Sep 2022 4:30 PM GMT
ఎగిరే గాలిపటంలా లైఫ్ సెల‌బ్రేష‌న్ ఇలా
X
ఎగిరే గాలిపటంలా లైఫ్ సెల‌బ్రేష‌న్ ఇలా చేయ‌డ‌మెలా?  తెలియాలంటే అమితాబ్ బచ్చన్ - రష్మిక మందన్న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `గుడ్ బాయ్` మొదటి పోస్టర్ చూడాలి. పోస్టర్ లో ప్ర‌ధాన తారాగ‌ణం ఒక అందమైన తండ్రి-కూతురుగా క‌నిపిస్తున్నారు. పాపాతో క‌లిసి ర‌ష్మిక అలా గాలిపటం ఎగుర‌వేస్తూ ఎంతో ప్లెజెంట్ లుక్ లో సంతోషంగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ ని ప‌రిశీలిస్తే ర‌ష్మిక ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌తిని త‌ల‌పిస్తోంది.

వికాస్ బహ్ల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ప్రతి భారతీయ కుటుంబం హృదయాన్ని కదిలించే తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కథాంశంగా ప్ర‌చారంలో ఉంది.

ఈ చిత్రం థియేటర్ల‌లో ఆడియెన్ ని చ‌క్క‌ని ఫ‌న్ తో కూడుకున్న సెంటిమెంట్ వ‌ర‌ల్డ్ లోకి తీసుకువెళుతుంది. కుటుంబ సంబంధాలపై ఒక అంద‌మైన క‌ల‌లాంటి సినిమా ఇద‌ని తెలుస్తోంది. లైఫ్ ని ఒక వేడుక‌లా ఎలా ఆస్వాధించాలో ఆవిష్క‌రించే హృదయాన్ని కదిలించే కథ‌తో తెర‌కెక్కింది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- నీనా గుప్తా- రష్మిక మందన్న - పావైల్ గులాటి - ఎల్లి అవ్రామ్- సునీల్ గ్రోవర్- సాహిల్ మెహతా- అభిషేక్ ఖాన్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. ఏక్తా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని  నిర్మించింది. 7 అక్టోబర్ 2022న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుదల కానుంది.

`పుష్ప 2` కోసం ర‌ష్మిక ప్రిప‌రేష‌న్

`పుష్ప` ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే గాక ర‌ష్మిక‌కు న‌టిగా మంచి పేరు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే ఉత్సాహంలో ఈ బ్యూటీ పార్ట్ 2 కోసం ప్రిప‌రేష‌న్ సాగిస్తోంది. బ‌న్నీకి పాన్ ఇండియాలో ఇమేజ్ పెర‌గ‌డంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని భారీ కాన్వాస్ పై కేజీఎఫ్ రేంజులో తెర‌కెక్కిస్తుండ‌డంతో ర‌ష్మిక పాత్ర‌కు న‌టించే స్పాన్ పెర‌గ‌నుంద‌ని స‌మాచారం. వ‌రుస జాక్ పాట్ ల‌తో ఈ బ్యూటీ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.