Begin typing your search above and press return to search.

ట్విట్టర్ కు మెగాస్టార్ వార్నింగ్

By:  Tupaki Desk   |   1 Feb 2018 6:52 AM GMT
ట్విట్టర్ కు మెగాస్టార్ వార్నింగ్
X
బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అమితాబ్ ఏం చేసినా వార్తే. ఇదిగో ఇప్పుడు నేరుగా ట్విట్ట‌ర్కే పరోక్షంగా హెచ్చ‌రించారు... అది కూడా న‌వ్వుతూనే. ఈ విష‌యం వైర‌ల్ అవ్వ‌కుండా ఎలా ఉంటుంది. అస‌లు బిగ్ బీ కి ట్విట్ట‌ర్‌ పై ఎందుకు కోపం వ‌చ్చింది?

ట్విట్ట‌ర్‌లో బాలీవుడ్ న‌టుల్లో ఎక్కువ ఫాలోయింగ్ అమితాబ్‌కే ఉండేది. కానీ కొన్ని రోజులుగా ప‌రిస్థితి మారిపోతోంది. క్ర‌మంగా అమితాబ్ ఫాలోవ‌ర్లు త‌గ్గిపోతూ వస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఇప్పుడు నెంబ‌ర్ వ‌న్ స్థాయికి చేరుకున్నాడు. ప్ర‌స్తుతం షారూఖ్‌కు 32,944,338 మంది ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్లు ఉండ‌గా, అమితాబ్ కు 32,902,353 మంది ఉన్నారు. దీనిపై నేరుగా ట్విట్ట‌ర్‌ కే ట్వీటు పెట్టారు బిగ్ బీ.

ట్విట్ట‌ర్ నువ్వు నా ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ని త‌గ్గించేశావ్‌? ఇది జ‌స్ట్ జోకేలే... అయినా నీ నుంచి సెల‌వు తీసుకునే స‌మ‌యం వ‌చ్చింది. ఇంకా సముద్రంలో బోలెడు చేప‌లు ఉన్నాయి... అని ట్వీటు చేశారు. స‌ముద్రంలో బోలెడు చేప‌లు ఉన్నాయి అంటే అర్థం... ట్విట్ట‌ర్ లాంటివే అనేక సోష‌ల్ మీడియా సైట్లు ఉన్నాయి అని అర్థం. దీనిని బ‌ట్టి చూస్తుంటే ట్విట్ట‌ర్ నుంచి త్వ‌ర‌లో బిగ్ బీ బ‌య‌టికి వ‌చ్చేసే అవకాశం క‌నిపిస్తోంది. మ‌రి అత‌ని ఫ్యాన్స్ అంతా ఏమైపోతారో!!