Begin typing your search above and press return to search.

స్కూల్ డేస్ లో అమితాబ్ ని వాళ్ల‌తో క‌లిపార‌ట‌!

By:  Tupaki Desk   |   23 Dec 2022 2:33 PM GMT
స్కూల్ డేస్ లో అమితాబ్ ని వాళ్ల‌తో క‌లిపార‌ట‌!
X
ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో అమితాబ్ బచ్చ‌న్ కు ప్ర‌త్యేక స్థానం వుంది. దీవార్‌, జ‌మీర్‌, షోలే, జంజీర్‌ వంటి సంచ‌ల‌న సినిమాల‌తో యాంగ్రీయంగ్ మెన్ గా సూప‌ర్ స్టార్ గా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. 1969లో `సాత్ హిందూస్తానీ` మూవీతో కెరీర్ ప్రారంబించిన అమితాబ్ ద‌శాబ్దాల కాలంగా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూ ఇప్ప‌టికీ యంగ్ స్ట‌ర్స్ కు గ‌ట్టి పోటీనిస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లోనూ, క్రేజీ టెలివిజ‌న్ షోల్లోనూ ప్ర‌ముఖంగా క‌నిపిస్తూ త‌న స‌త్తా చాటుకుంటున్నారు.

ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్త‌ల్లో నిలిచిన అమితాబ్ తాజాగా ఓ చిన్నారితో జ‌రిపిన స‌ర‌దా సంభాష‌ణ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఓ ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛానల్ లో అబితాబ్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు చిన్నారులు పాల్గొన్నారు. వారితో క‌లిసి అమితాబ్ సంద‌డి చేశారు. ప‌లువురు పిల్ల‌ల‌లో అమితాబ్ స‌ర‌దాగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఓ పాప త‌న రిపోర్ట్ కార్డ్ లో హైట్ త‌క్కువగా వున్న వాళ్లంటే త‌న‌కు ఇష్టం లేద‌ని రాసుకొచ్చింది.

ఇది గ‌మ‌నించిన అమితాబ్ ఈ అంశంపై మాట్లాడుతూ త‌న చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. త‌న చిన్న‌త‌నంలో జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. హైట్ వ‌ల్ల త‌ను చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాన‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అమితాబ్ మాట్లాడుతూ `నేను చ‌దువుకున్న స్కూల్ లో బాక్సింగ్ ఖ‌చ్చితంగా నేర్చుకోవాలి. నేను ఎత్తు ఎక్కువ‌గా వున్నాన‌ని, న‌న్ను సీనియ‌ర్స్ టీమ్ లో వేశారు.

కేవ‌లం నా హైట్ కార‌ణంగానే తాను సీనియ‌ర్స్ తో క‌లిసి వుండాల్సి వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా అమితాబ్ స్ప‌ష్టం చేస్తూ ఆనాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా వుంటే త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ కు ఫిల్మ్ ఫేర్ రావ‌డంపై అమితాబ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా అబిషేక్ కు అభినంద‌న‌లు తెలిపారు. నిన్ను విమ‌ర్శించే వారికి నీ ప‌నిత‌నంతో స‌మాధానం చెబుతూ నీ స‌త్తాని నిరూపించుకుంటున్నావు యు ఆర్ ది బెస్ట్` అంటూ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.