Begin typing your search above and press return to search.

ప్రతి ఆదివారం అమితాబ్ అలా చేయడానికి కారణం ఇదే..!

By:  Tupaki Desk   |   7 Jun 2023 4:04 PM GMT
ప్రతి ఆదివారం అమితాబ్ అలా చేయడానికి కారణం ఇదే..!
X
అమితాబ్ బచ్చన్.. పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అనుకునే చాలా మందికి ఆయనే ఆదర్శం. బాలీవుడ్ కొన్ని వందల సినిమాల్లో నటించి ఆయన అలరించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా, ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే, అమితాబ్ గురించి అందరికీ ఓ విషయం తెలిసే ఉంటుంది. ఏ హీరో చేయని విధంగా ఆయన ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తూ ఉంటారు. దాదాపు 41 సంవత్సరాలుగా అభిమానులను కలిసే సంప్రదాయాన్ని ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన తన అభిమానులను కలిసే ఆచారాన్ని జల్సా బంగ్లా అని కూడా పిలుస్తారు.

అయితే, ఆయన అభిమానులను కలవడానికి వచ్చే సమయంలో చెప్పులు ధరించరు. ఆయన అలా చెప్పులు వేసుకోకుండా వచ్చి అభిమానులతో మాట్లాడి వెళుతూ ఉంటారు. అలా చెప్పులు వేసుకోకపోవడానికి కారణాన్ని ఆయన స్వయంగా వెల్లడించడం విశేషం. తాను అభిమానులు ఇచ్చే గౌరవార్థం చెప్పులు ధరించనని ఆయన చెప్పడం విశేషం.

గుడికి వెళితే ఎవరైనా చెప్పులు వేసుకొని లోపలికి వెళతారా లేదు కదా అని ఆయన ప్రశ్నించారు. తాను కూడా అంతే అన్నారు. తన అభిమానులే తన శ్రేయస్సు కోరుకుంటారని, అందుకే వాళ్లు తనకు దేవుళ్లతో సమానమని ఆయన చెప్పారు.

అందుకే వాళ్లు నిల్చున్న ప్రాంతం కూడా తనకు గుడి లాంటిదేనని అందుకే తాను ఆ సమయంలో చెప్పులు వేసుకోనని చెప్పడం గమనార్హం. కాగా ఆయన చెప్పిన కారణం విని చాలా మంది ఫిదా అయిపోయారు. అభిమానులు మీలా ఇంత గొప్పగా అభిమానించేవారు చాలా అరుదు సర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అమితాబ్ ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా, దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. కాగా, ఇటీవల ఈ మూవీ షూటింగ్ సమయంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఆయన షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.