Begin typing your search above and press return to search.

80లో ఈ స్పీడ్ ఏంటి బచ్చన్ సాబ్!

By:  Tupaki Desk   |   2 March 2023 5:00 PM GMT
80లో ఈ స్పీడ్ ఏంటి బచ్చన్ సాబ్!
X
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అలా ఆయన కీలక పాత్రలలో నటిస్తున్న సినిమాల్లో మన పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్-కె కూడా ఉంది. ఇక పింక్ అనే కోర్టు రూం డ్రామా సూపర్ హిట్ అయిన తరువాత బాలీవుడ్ మెగాస్టార్ మరో కోర్ట్ రూమ్ డ్రామా సినిమాకి సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రిభు దాస్‌గుప్తా రచించి, దర్శకత్వం వహించనున్న సెక్షన్ 84లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారనేది తాజా వార్త.

యుధ్ సహా టెన్ సినిమాల తర్వాత సదురు దర్శకుడు అమితాబచ్చన్ తో చేస్తున్న మూడో సినిమా ఇదే. సెక్షన్ 84 షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది అని తెలుస్తోంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్ హ్యాంగర్, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్ సహా జియో స్టూడియోస్ కలిసి ఈ కోర్ట్‌రూమ్ డ్రామాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిగిలిన నటినట్లు సినిమాకి పని చేయబోయే టెక్నీషియన్ల వివరాలను మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒకరకంగా అమితాబచ్చన్ వయసు ఇప్పుడు 80 సంవత్సరాలకు దగ్గరబడింది అయితే 80 సంవత్సరాల వయసులో ఉన్న వారందరూ ఇంటికే పరిమితమై కృష్ణా రామా అని కాలం వెల్లదీస్తుంటే 80 సంవత్సరాలు వయసులో అనేక అనారోగ్య సమస్యలు చుట్టూ మూడుతున్న బాలీవుడ్ బిగ్బి అమితాబచ్చన్ మాత్రం ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా తన లైఫ్ని డిజైన్ చేసుకోవడం బాలీవుడ్ ఇంగ్రిమాన్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ గతంలో అనేక సందర్భాలలో చివరి నిమిషం వరకు తాను నటిస్తూనే ఉంటానని తనకు నటన తప్ప మరో వ్యాపకం లేదని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఆయన నిజంగానే అన్న మాటలకు కట్టుబడి వరుస ప్రాజెక్టులు ఒప్పుకుంటూ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా తనకు తానే సాటి అని నిరూపించుకునే పనిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు తన సినిమాలతో అలరించనున్న ఆయన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తారో అనేది వేచి చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.