Begin typing your search above and press return to search.

‘సైరా’కు అతను సెట్టవుతాడా?

By:  Tupaki Desk   |   25 March 2018 5:53 AM GMT
‘సైరా’కు అతను సెట్టవుతాడా?
X
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని భావిస్తున్న చిత్ర బృందం.. టాప్ టెక్నీషియన్లను ఎంచుకుంది. కానీ వాళ్ల ప్రణాళికలు అనుకున్న ప్రకారం సాగలేదు. సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రం నుంచి అనివార్య కారణాల వల్ల తప్పుకున్నారు. ఛాయాగ్రహణ బాధ్యతల్ని రత్నవేలు అందుకున్నాడు కానీ.. మ్యూజిక్ డైరెక్టర్ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ‘బాహుబలి’తో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న కీరవాణికి బాధ్యతలు అప్పగిస్తారని.. ‘సైరా’ మోషన్ పోస్టర్ కు సంగీతం అందించిన తమన్ ను ఓకు చేశారని ప్రచారాలు జరిగాయి కానీ.. అవేమీ నిజం కాలేదు.

తాజా సమాచారం ప్రకారం ‘సైరా’కు బాలీవుడ్ యువ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఫైనలైజ్ అయ్యాడట. ‘క్వీన్’.. కై పో చె’.. ‘ఉడ్తా పంజాబ్’.. ‘డియర్ జిందగీ’ లాంటి సినిమాలకు సంగీతాన్నందించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘సైరా’ను హిందీలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ను ఓ కీలక పాత్రకు ఒప్పించింది చిత్ర బృందం ఇప్పుడు అమిత్ ను సంగీత దర్శకుడిగా ఫైనలైజ్ చేయడం కూడా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. ఐతే అమిత్ బాలీవుడ్లో చేసినవన్నీ క్లాస్ సినిమాలు. అతడి సంగీతం కూడా చాలా క్లాస్ గా ఉంటుంది. కానీ ‘సైరా’ లాంటి సినిమాల సంగతి వేరు. యాక్షన్.. ఎమోషన్ ప్రధానంగా సాగే ఇలాంటి సినిమాల్లో నేపథ్య సంగీతంతోనే రోమాలు నిక్కబొడుచుకునేలా చేయాల్సి ఉంటుంది. పాటలు కూడా మాస్ కు బాగా ఎక్కేలా ఉండాలి. మరి ఈ తరహా మ్యూజిక్ అమిత్ చేయగలడా అన్నది సందేహం. మరి ‘సైరా’ టీం ఆలోచనేంటో?