Begin typing your search above and press return to search.

బిగ్ బాస్-2 నుంచి అమిత్ ఔట్!

By:  Tupaki Desk   |   16 Sep 2018 5:06 AM GMT
బిగ్ బాస్-2 నుంచి అమిత్ ఔట్!
X
బిగ్ బాస్ సీజ‌న్ -2లో ఏమైనా జ‌ర‌గొచ్చంటూ....నాని చెప్పినట్లుగానే ఈ సీజ‌న్ ముగింపున‌కు వ‌స్తోన్న త‌రుణంలో అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. గీతా మాధురి ముద్దుల ఎపిసోడ్ - ఈ షోపై హెచ్ ఆర్ సీలో ఫిర్యాదు - బిగ్ బాస్ షోపై - కౌశ‌ల్ ఆర్మీపై బాబు గోగినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం - కౌశ‌ల్ ఆర్మీ 2కే ర‌న్....ఇలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు తీసిపోని రీతిలో ఫైన‌ల్ కు ముందు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఈ నేప‌థ్యంలోనే ఫైనల్ కు ముందు బిగ్ బాస్ నుంచి అమిత్ ఎలిమినేట్ అయ్యాడు. గ‌త రెండు వారాల నుంచి బిగ్ బాస్ వేటు త‌ప్పించుకుంటోన్న అమిత్...ఈ వారం ఎగ్జిట్ కాక‌ త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లలో మ‌రొకరు వ‌చ్చే ఆదివారం ఎలిమినేట్ కాబోతున్నారు.

గ‌త రెండు వారాల నుంచి అమిత్ ఎలిమినేష‌న్ నుంచి ఎస్కేప్ అవుతున్నాడు. మిగ‌తా కంటెస్టెంట్ కంటే అమిత్ కు త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. అయితే, రీ ఎంట్రీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావ‌డంతో అమిత్ సేఫ్ అయ్యాడు. కానీ, ఈ సారి మాత్రం అమిత్ కు నిరాశ త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం హౌస్ లో త‌నీష్ - గీతా మాధురి - కౌశ‌ల్ - సామ్రాట్ - రోల్ రైడా - దీప్తి న‌ల‌మోతు ఉన్నారు. వీరిలో ఒక‌రు వ‌చ్చే ఆదివారం ఎలిమినేట్ కాబోతున్నారు. మిగిలిన ఐదుగురు ఫైనల్ కు చేరుకుంటారు. ఫ్రీజ్ అండ్ రిలీజ్ టాస్క్ లో భాగంగా....త‌మ గురించిన అప్ డేట్స్ ను కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ వారికి అంద‌జేస్తున్నారు. అయితే, ఇప్ప‌టికి మాత్రం 50 శాతం ఓట్ల‌తో కౌశ‌ల్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా...దీప్తి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఏది ఏమైనా, రాబోయే రెండు వారాలు ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచేందుకు బిగ్ బాస్ సిద్ధ‌మ‌వుతోంది.