Begin typing your search above and press return to search.

సూప‌ర్ హాట్ ఫోజులో అమీషా మెరుపులే!

By:  Tupaki Desk   |   22 April 2022 2:30 AM GMT
సూప‌ర్ హాట్ ఫోజులో అమీషా మెరుపులే!
X
సోష‌ల్ మీడియాలో మంట‌లు రేపే ఫోటోషూట్లను షేర్ చేసి దుమ్ము రేపడం ఇప్ప‌టి ట్రెండ్. ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ ట్విటర్ వేదికగా సెలబ్రిటీలు పాపులారిటీ ని పెంచుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. ముఖ్యంగా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్లు అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉండటానికి ఈ మాధ్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.నాటి మేటి కథనాయికలు సైతం తమను మర్చిపోవద్దని అభిమానులకు ఎప్పటికప్పు డు గుర్తు చేస్తూనే ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ హాట్ గాళ్ అమీషా పటేల్ మరోసారి తనదైన స్టింట్ తో ఒక్కసారిగా హీటెక్కించింది. తరుచూ ఇన్ స్టా వేదికగా అమీషా హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటుంది. విదేశీ టూర్లు.. వ్యక్తిగత బెడ్ రూమ్ ఫోటోలను సైతం షేర్ చేసి అటెన్షన్ ని డ్రా చేస్తుంటుంది. తాజాగా మరోసారి కుర్రాళ్లలను కవ్వించే ప్రయత్నం చేసింది.

ప‌సుపు క‌ల‌ర్ నిక్క‌రు ధ‌రించి..టాప్ లో మిరుమిట్లు గొలిపే రంగుల బ్లౌజు లో మ‌తి పొగుడుతుంది. కళ్ల‌కు అద్దాలు ధరించి ఒంపు సొంపుల రూపలావణ్యాన్ని ఆవిష్కరించింది. మండే ఎండ‌లో అమీషా అందాలు మ‌రింత హీటెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అమీషా అభిమానులు ఒక రేంజులో కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ ఫోటో ఇప్ప‌టిదా? పాత‌దా? అన్న‌ది సందేహం. చాలా ఓల్డ్ పిక్ లా క‌నిపిస్తుంది. పాతో ఫోటోనే ఇప్పుడు చేసి అటెన్ష‌న్ డ్రా చేస్తుందా? అన్న సందేహం ప‌లువురిది.

ప్రస్తుతం అమీషా హిందీలో `దేశీ మ్యాజిక్`... `ద గ్రేట్ ఇండియా క్యాసీనో` చిత్రల్లో నటిస్తోంది.` బద్రి` సినిమాతో ఆమె తెలుగులో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `నాని` లో నటించింది. కానీ టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అమీషా పటేల్ (45) తొలి నుంచి బాలీవుడ్ టార్గెట్ గా నే ఎక్కువ సినిమాలు చేసింది.