Begin typing your search above and press return to search.

హృతిక్ ముందు రేంజ్ చూపించిన అమీషా రోజుల‌వి!

By:  Tupaki Desk   |   29 Jan 2022 8:00 AM IST
హృతిక్ ముందు రేంజ్ చూపించిన అమీషా రోజుల‌వి!
X
` క‌హోనా ప్యార్ హై` సినిమాతో అమీషా ప‌టేల్ కి బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో బ్యూటీ హృతిక్ రోష‌న్ కి కి జంట‌గా న‌టించింది. ఈ రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమాకు గానూ అమీషా అవార్డులు..రివార్డులు సైతం ద‌క్కించుకుంది. అలా తొలి సినిమాతోనే అమీషా ప‌టేల్ ఉత్త‌రాదిన ఫేమ‌స్ అయింది. ఆ త‌ర్వాత ద‌శాబ్ధం పాటు కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూసుకోకుండా సాగిపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే అమీషా పెద్దింటి అమ్మాయి అని..బైబ‌ర్త్ గోల్డ్ స్పూన్ బేబి అప్ప‌ట్లోనే ప్ర‌చారం సాగాంది.

కాస్త త‌ల‌బిరుసు మ‌న‌స్త‌త్వం అన్న‌ది కూడా హైలైట్ అయింది. తాజాగా ఈ సినిమా ఆన్ సెట్స్ అనుభ‌వాల్ని ఓ సంద‌ర్భంలో గుర్తు చేసుకుంది అమీషా ప‌టేల్. త‌న‌పై ఉన్న స్నోబిష్ ..రిచ్ బిచ్ ఇమేజ్ గురించి రివీల్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. ``ఆన్ సెట్స్ లో కాళీ స‌మ‌యంలో ఏదైనా పుస్త‌కం చ‌దివితే..అందులో లీన‌మ‌య్యేదాన్ని. ఇంకే విష‌యాన్ని ప‌ట్టించుకునే దాన్ని కాదు. ఆ కార‌ణంగా చూసిన వాళ్లు అంతా అహంకారి అనుకునేవారు. అలాగే `క‌హోనా ప్యార్ హై` షూటింగ్ రోజూ మెర్సిడెస్ బెంజ్ కారులో వ‌చ్చేదాన్ని...హృతిక్ రోష‌న్ మారుతి 800 లో వ‌చ్చేవారు. ఆ కార‌ణంగాను న‌న్ను ఎగ‌తాళి చేసేవారు.

ఆ స‌మ‌యంలో నా గురించి బ‌య‌ట వ్య‌క్తుల‌కు ఎలా చెప్పుకోవాలో తెలిసేది కాదు. చిన్న నాటి నుంచి నా పెంప‌కం అంతే. ఆర‌కంగా న‌న్ను ద‌క్ష‌ని బొంబాయి ధ‌ని బ్రాట్ గా చిత్రీక‌రించారు`` అని అమీషా ప‌టేల్ నాటి అనుభ‌వాల‌ని గుర్తు చేసుకుంది. ఇక తెలుగులో బ‌ద్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. అటుపై `నాని` స‌హా మరికొన్ని సినిమాలో న‌టించింది. కానీ టాలీవుడ్ లో మాత్రం కెరీర్ బిజీగా సాగ‌లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది.