Begin typing your search above and press return to search.

`అమిగోస్‌` కోసం `ధ‌ర్మ‌క్షేత్రం` సాంగ్!

By:  Tupaki Desk   |   26 Jan 2023 5:18 PM GMT
`అమిగోస్‌` కోసం `ధ‌ర్మ‌క్షేత్రం` సాంగ్!
X
కెరీర్ ప్రారంభం నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌ని, కొత్త క‌థ‌ల‌ని ప్రోత్స‌హిస్తూ స‌రికొత్త సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్. స‌క్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ వ‌స్తున్న క‌ల్యాణ్ రామ్ ఇటీవ‌ల కొత్త ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ టైమ్ ట్రావెల్ డ్రామాగా సెమీ పీరియాడిక్ డ్రామా `బింబిసార‌`లో న‌టించ‌డం.. ఆ మూవీ సూప‌ర్ హిట్ అనిపించుకోవ‌డ‌మే కాకుండా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఇండ‌స్ట్రీకి స‌రికొత్త జోష్ ని అందించింది.

ఈ మూవీ త‌రువాత నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `అమిగోస్‌`. రీసెంట్ గా `బింబిసార‌`తో స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేసిన క‌ల్యాణ్ రామ్ అదే జోష్ తో చేసిన సినిమా ఇది. టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న‌ ఈ మూవీ ద్వారా రాజేంద్ర‌ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో హీరో కల్యాణ్ రామ్ విభిన్నంగా సాగే మూడు పాత్ర‌ల్లో త్రిపాత్రాభిన‌యం చేస్తున్నారు.

గ‌త సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన క‌థ‌తో రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని స‌రికొత్త క‌థ నేప‌థ్యంలో రూపొందిన సినిమా ఇది. ఇంత వ‌ర‌కు విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. దీంతో ఇప్ప‌టికే ఈ మూవీ థియేట్రిక‌ల్‌, నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా టేబుల్ ప్రాఫిట్ లోకి వెళ్లిన‌ట్టుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అషికా రంగ‌నాథ‌న్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్నఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 10న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. మూడు విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ ల‌లో క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్రారంభించారు. ఈ మూవీ కోసం 1992లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `ధ‌ర్మ‌క్షేత్రం` మూవీలోని `ఎన్నో రాత్రులొస్తాయి గానీ..` అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాట‌ను సెకండ్‌ సింగిల్ గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ఫ్యాన్స్ తో క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతున్న ఓ వీడియోని వ‌దిలిన విష‌యం తెలిసిందే.

గురువారం సాయంత్రం 5:09 నిమిషాల‌కు అనౌన్స్‌చేశారు. అంతే కాకుండా ఈ లిరిక‌ల్ వీడియోని జ‌న‌వ‌రి 29న సాయంత్రం 5:09 నిమిషాల‌కు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ పాట `అమిగోస్‌` మూవీకి ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది. ఒకే ర‌కంగా వున్న ముగ్గ‌రు వ్య‌క్తుల జీవితాల‌ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మైన క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. క‌ల్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలి సారి ట్రిపుల్ రోల్ లో న‌టిస్తున్న ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా, సౌంద‌ర‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.