Begin typing your search above and press return to search.
అమిగోస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ ఇక కష్టమే.. 4 రోజుల్లో ఎంతంటే?
By: Tupaki Desk | 14 Feb 2023 1:16 PM GMTగత ఏడాదే బింబిసార ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ జోష్‌తో రీసెంట్గా అమిగోస్‌తో ప్రేక్షకుల మందుకు వచ్చారు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను దక్కించుకుని ఫెయిల్యూర్‌గా నిలిచింది. మొదటి రోజు నుంచే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. రోజు రోజుకు కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి.
కానీ మూడో రోజు ఆదివారం మాత్రం హాలీడే అవ్వడం వల్ల తొలి రెండు రోజులతో పోలిస్తే వసూళ్లు ఓ మోస్తరుగా పెరిగాయి. అయితే మళ్లీ నాలుగో రోజు సోమవారం డౌన్ అయిపోయాయి. అసలే ఇప్పుడు నాన్ హాలీడే డేస్ కాబట్టి కలెక్షన్స్ రావడం కష్టమే. ఈ వసూళ్లు చూస్తుంటే సినిమాకు బాగా నష్టాలు వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా మొదటి రోజు రూ. 2.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.65 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలైంది. నాలుగు రోజుల్లో కేవలం ఐదు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా రూ.5.65కోట్ల షేర్, 9.75కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ కలిపి తొలి రోజు రూ.2.03కోట్లు, రెండో రోజు1.11కోట్లు, మూడో రోజు 1.21కోట్లు నాలుగో రోజు రూ.35లక్షలు వచ్చాయి. నాలుగు రోజుల్లో నైజాంలో రూ.1.36 కోట్లు, సి డెడ్ రూ.88 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 59 లక్షలు, ఈస్ట్ రూ.44 లక్షలు, వెస్ట్ రూ. 26 లక్షలు, గుంటూరు రూ.55 లక్షలు, కృష్ణ రూ. 39 లక్షలు, నెల్లూరు రూ. 23 లక్షలు వచ్చాయి. మొత్తంగా ఏపీ తెలంగాణ కలిపి నాలుగు రోజుల్లో రూ.4.70కోట్లు, 7.75కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యాయి. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.31 లక్షలు, ఓవర్సీస్ రూ.64 లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ.5.65కోట్ల షేర్, 9.75కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యాయి.
ఇకపోతే ఈ చిత్రం ఓవరాల్ గా 11.30 కోట్ల బిజినెస్ చేసింది. అంటే దీని బ్రేక్ ఈవెన్ 12 కోట్లు. ఈ సినిమా గట్టెక్కాలంటే మరో రూ.6.35 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. మరి వస్తుందో లేదో చూడాలి.
అసలు ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందనే అంచనా తోనే భారీ రేట్స్ తో కోనుగోలు చేశారు. ఎందుకంటే బింబిసారా చిత్రానికి మొదటిరోజు దాదాపు రూ. 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
కళ్యాణ్ రామ్ రేంజ్‌కు అంత వసూళ్లు అంటే చాలా ఎక్కువ. అంతే కాదు ఆ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. అదే ఊపులో అమిగోస్ ఆడేస్తుందని బయ్యర్స్ కాస్త ఎక్కువ పెట్టి కొనుగోలు చేశారు. కానీ అది జరగలేదు. ఇక కళ్యాణ్ రామ్ నెక్స్ట్ చిత్రం బింబిసారా 2 ఈ ఏడాది లోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.