Begin typing your search above and press return to search.

నన్ను రేప్ చేయడానికి అనుమతించాలా?

By:  Tupaki Desk   |   13 Sept 2020 7:30 PM IST
నన్ను రేప్ చేయడానికి అనుమతించాలా?
X
తన ఇంటిని మహారాష్ట్ర సర్కార్ కూల్చేసిన ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ కంగన రౌనత్ మహారాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీని ముంబైలోని రాజ్ భవన్ లో కంగన కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కంగన.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ శివసేన పత్రికలో కంగన గురించి ఆదివారం సుధీర్ఘ వ్యాసం రాశారు. బీజేపీ తో కలిసి కంగన బీహార్ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ఈ డ్రామా ఆడుతోందని.. కంగన వెనుకున్నది కాషాయ నేతలే అని అందరికీ తెలుసు అని సంజయ్ రౌత్ ఆరోపించారు. ముంబైని ఎవరూ రేప్ చేసినా వారికి పట్టదని.. డబ్బు సంపాదనకే కొందరు వస్తారని సంజయ్ రౌత్ ఘాటుగా కంగన గురించి రాసుకొచ్చాడు.

ఈ వ్యాఖ్యలపై కంగన ఘాటు సమాధానం ఇచ్చింది. తన వెనుక బీజేపీ ఉందని శివసేన ఎంపీ అనడంపై .. ‘నిజమే డ్రగ్ రాకెట్ మాఫియాను బద్దలు కొట్టిన వారికి బీజేపీ మద్దతివ్వడం అత్యంత దురదృష్టకరం. శివసేన గుండాలు నాపై దాడి చేయడానికి.. నన్ను రేప్ చేయడానికి బీజేపీ మద్దతు ఇవ్వాల్సింది కదా .. అంతేనంటారా సంజయ్ జీ’ అని కంగన కౌంటర్లు ఇచ్చింది.

ఈ క్రమంలోనే కంగన మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.కంగనకు డ్రగ్స్ అలవాటు ఉందని.. తన ముందే ఎన్నో సార్లు తీసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుమన్ వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇలా కంగన వర్సెస్ శివసేన సర్కార్ వార్ ముంబైలో హాట్ టాపిక్ గా మారింది. ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.