Begin typing your search above and press return to search.

బౌన్స్ బ్యాక్ అవుతాం.. అప్ప‌టివ‌ర‌కూ బ‌త‌కనివ్వండి!-ఛార్మి

By:  Tupaki Desk   |   4 Sep 2022 6:54 AM GMT
బౌన్స్ బ్యాక్ అవుతాం.. అప్ప‌టివ‌ర‌కూ బ‌త‌కనివ్వండి!-ఛార్మి
X
బాక్సాఫీస్ వద్ద `లైగర్` పేలవమైన ప్రదర్శన తర్వాత నిర్మాత ఛార్మి మొదటిసారిగా తన మౌనాన్ని వీడి ఓ పెద్ద ప్ర‌క‌ట‌న చేసారు. త‌న సోష‌ల్ మీడియాలో ఛార్మి వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంత‌కీ ఛార్మి ఏమ‌న్నారు? అంటే... మీరు బ‌తుకుతూ అంద‌రినీ బ‌త‌క‌నివ్వండ‌ని కోరారు. ఒక సందేశంలో ``చిల్ గ‌య్స్! జ‌స్ట్ టేకింగ్ ఏ బ్రేక్ (ఫ్రం సోష‌ల్ మీడియా).. పూరి క‌నెక్ట్స్ మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది.. ఇంత‌కంటే బిగ్గ‌ర్ గా బెట‌ర్ గా.. అప్ప‌టివ‌ర‌కూ మీరు బ‌త‌కండి మ‌మ్మ‌ల్ని బ‌త‌క‌నివ్వండి!`` అంటూ గ‌ట్టిగానే పంచ్ వేసింది ఛార్మి.

విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవ‌డం పూరి-ఛార్మి బృందాన్ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ముఖ్యంగా స‌మీక్ష‌కులు ఈ సినిమాపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మ‌న‌సు నొచ్చుకునేలా చేసిన సంగ‌తి తెలిసిందే. టిక్కెట్ విండో వద్ద ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. తొలి నాలుగు రోజుల‌కే సినిమా వసూళ్లు క్రమంగా తగ్గుతూ డిజాస్ట‌ర్ గా నిలిచింది. లైగర్ కథలో జనాలను థియేటర్లకు లాక్కెళ్లే కొత్తదనం ఏమీ లేదని టాక్ వినిపించింది. ఇదిలా ఉండగా లైగర్ బాక్సాఫీస్ వద్ద విఫలమైన తర్వాత చిత్ర నిర్మాత ఛార్మి కౌర్ మొదటిసారిగా స్పందించింది. ఛార్మి ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ-ప్రజలు ఇంట్లో కూర్చొని ఒకే క్లిక్ తో సినిమాలు చూసే అవకాశం ఉందని చెప్పారు. ``నేటి కాలంలో కుటుంబమంతా కలిసి ఇంట్లో కూర్చొని ఏదైనా భారీ బడ్జెట్ సినిమా చూడవచ్చు. మీ కంటెంట్ ప్రజలను ఉత్తేజపరిస్తే తప్ప వారు థియేటర్లకు వెళ్లరు`` అని అన్నారు.

కానీ బాలీవుడ్ లో అయితే అలా కనిపించడం లేదని కూడా అన్నారు. ఈ సంవత్సరం ఆగస్టులో మూడు సౌత్ సినిమాలు బింబిసార‌- సీతారామం - కార్తికేయ 2 విడుదలయ్యాయి. ఇవి మూడూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దక్షిణాదిలో సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఇంకెక్క‌డా ఉండ‌దని కూడా ఛార్మి అన్నారు. బాలీవుడ్ లో పరిస్థితి బాగా లేదని ఛార్మి చెప్పింది. ఇది భయానకంగా నిరుత్సాహంగా ఉందని కూడా వ్యాఖ్యానించారు.

చాలా కష్టపడి లైగర్ సినిమా చేశామ‌ని కానీ ఫలితం నిరాశపరిచిందని ఛార్మి తెలిపారు. తాను 2019లో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ని కలిశానని 2020 జనవరిలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించానని లైగర్ గురించి చెప్పింది. లైగర్ విజయ్ దేవరకొండ మొదటి బాలీవుడ్ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజులో విడుదలైంది. బహిష్కరణ కారణంగా సినిమా చాలా నష్టపోయింది. దానికి తోడు వ్య‌తిరేక స‌మీక్ష‌లు పెద్ద స‌మ‌స్యాత్మ‌కం అయ్యాయి. తొలి నాలుగు రోజుల్లోనే దారుణ‌ కలెక్షన్లతో సినిమా ఫ్లాప్ షో గా నిలిచింది. అందుకే గ‌య్స్ చిల్! అంటూ ఛార్మి సెటైర్ వేసింది. ప‌నిలో ప‌నిగా మీరు బ‌తుకుతూ మ‌మ్మ‌ల్ని బ‌త‌క‌నివ్వండి! అని కొటేష‌న్ వేసారు మ్యాడమ్.