Begin typing your search above and press return to search.

అమెరికాలో బ్యాంకుల‌కు తాళాలు తీయిస్తారా స‌ర్కారు వారు!

By:  Tupaki Desk   |   4 March 2021 5:30 PM GMT
అమెరికాలో బ్యాంకుల‌కు తాళాలు తీయిస్తారా స‌ర్కారు వారు!
X
అమెరికా బాక్సాఫీస్ ని మ‌రో నైజాం మార్కెట్ గా ట్రేడ్ ప‌రిగ‌ణిస్తోంది. 2.5-3.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు అక్క‌డ మ‌న స్టార్ హీరోల‌కు సాధ్య‌మ‌వుతోంది. దీన‌ర్థం సుమారు 20కోట్లు కేవ‌లం అమెరికా మార్కెట్ నుంచే కొల్ల‌గొట్టే సామర్థ్యం స్టార్ హీరోల‌‌కు ఉంద‌నే. ఇక విదేశీ బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హేష్ కి అన్నివేళ‌లా రికార్డులు ఉన్నాయి. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మొద‌లు ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు న‌టించిన చాలా సినిమాలు అమెరికాలో గొప్ప వ‌సూళ్ల‌ను సాధించాయి. అందుకే ఇప్పుడు స‌ర్కార్ వారి పాటపైనా అంతే ఆస‌క్తి నెల‌కొంద‌ని స‌మాచారం.

ఈ సినిమా కూడా ఓవ‌ర్సీస్ లో భారీగా రిలీజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ప‌ర‌శురామ్ క్రేజు విదేశాల్లో అంత లేక‌పోయినా.. అత‌డు తెర‌కెక్కించిన గ‌త చిత్రం `గీత గోవిందం` ఓవ‌ర్సీస్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 2.4 మిలియన్ డాల‌ర్ల‌ను సాధించింది. పైగా అత‌డి సినిమాల్లో ఫ్యామిలీ విలువ‌లు సెంటిమెంట్లు అక్క‌డా క‌నెక్ట‌వుతున్నాయి. అందుకే స‌ర్కార్ వారి పాట‌కు అమెరికా మార్కెట్లో డిమాండ్ నెల‌కొంద‌ని చెబుతున్నారు.

ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ కానుంది. అప్ప‌టికి అమెరికా మార్కెట్ మ‌హ‌మ్మారీ భ‌యాల నుంచి కోలుకుని.. సాధారణ స్థితికి వ‌స్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. పూర్తిగా థియేట‌ర్లు తెరిచేస్తే అమెరికా ట్రేడ్ భారీ ధ‌ర‌ల‌కు సంక్రాంతి సినిమాల్ని కొనుక్కునేందుకు ఆస్కారం ఉంటుంది. స‌ర్కార్ వారి పాట‌తో పాటు ప‌వ‌న్ -క్రిష్ హిస్టారిక‌ల్ సినిమా సంక్రాంతికే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా మార్కెట్ డ‌ల్ గా ఉంది. థియేట‌ర్లు పూర్తిగా తెర‌వ‌క‌పోవ‌డమే అందుకు కార‌ణం.

బ్యాంకుల కుంభ‌కోణం నేప‌థ్యంలో భారీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్ర‌మిద‌ని ప‌ర‌శురామ్ ఇప్ప‌టికే హింట్ ఇచ్చారు. మ‌హేష్ బ్యాంక్ మేనేజ‌ర్ కొడుకుగా మాస్ యాక్ష‌న్ అద‌ర‌గొడ‌తాడ‌ట‌. ఇంత‌కుముందు తాళాల (కీ) గుత్తి ప‌ట్టుకుని ఉన్న పోస్ట‌ర్ ని ముద్రించ‌డంతోనే హీట్ పెంచారు. అన్న‌ట్టు బ్యాంకుల‌కు తాళాం తీయాలంటే మ‌హేష్ అనుమ‌తి కావాల్సిందేనేమో! బ్యాంక్ మేనేజ‌ర్ అయిన త‌న‌ తండ్రికి ఓ స్కామ్ స్ట‌ర్ వ‌ల్ల ఎదురైన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకే మ‌హేష్ అలా చేస్తార‌ట‌. మిగ‌తా క‌థేంటో సినిమా చూసే తెలుసుకోవాలి.