Begin typing your search above and press return to search.

1656 కోట్ల ఖ‌రీదైన భ‌వంతిని కొన్న ప్ర‌ముఖ గాయ‌ని

By:  Tupaki Desk   |   22 May 2023 5:00 AM GMT
1656 కోట్ల ఖ‌రీదైన భ‌వంతిని కొన్న ప్ర‌ముఖ గాయ‌ని
X
అమెరికన్ పాప్ స్టార్ బియోన్స్ .. సంగీత విద్వాంసుడు భర్త జే-జెడ్ ఇటీవల కాలిఫోర్నియాలో కొత్త ఇంటి కోసం 200 మిలియన్ డాల‌ర్లు (సుమారు రూ.1656 కోట్లు) వెచ్చించారు. మాలిబులోని ఈ ఇల్లు రాష్ట్రంలోనే ఇప్పటివరకు కొనుగోలు చేసిన‌ ఖరీదైన రియల్ ఆస్తి అని తెలిసింది. అయితే దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఇది కానే కాదు... ఆ గౌరవం హెడ్జ్ ఫండ్ టైటాన్ కెన్ గ్రిఫిన్ కు ద‌క్కుతుంది. అతను న్యూయార్క్ నగరంలోని 220 సెంట్రల్ పార్క్ సౌత్ లో ఫోర్ స్టోరీడ్ ఇంటి కోసం 2019లో సుమారు 238 మిలియన్ డాల‌ర్లు వెచ్చించాడు. అంటే సుమారు 1800 కోట్లు పెట్టాడ‌న్న‌మాట‌.

బియాన్స్-జే జెడ్ జంట కొనుగోలు చేసిన ఇల్లు 30000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పసిఫిక్ మహాసముద్రం వ్యూ పాయింట్ (వీక్షణ)ను కలిగి ఉంది. ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన వాస్తుశిల్పులలో ఒకరైన తాడో ఆండో - ప్రిట్జ్ కర్ ప్రైజ్ విజేత దీనిని రూపొందించారు. గతంలో రాపర్ కాన్యే వెస్ట్ మాలిబు హౌస్‌ను సృష్టించిన క్రియేట‌ర్ ఈయ‌న‌.

కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన గృహ కొనుగోలులో మునుపటి రికార్డును బియోన్స్ - జే-జెడ్ అధిగమించారు. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ వివ‌రాల‌ ప్రకారం.. 2021లో మిస్టర్ ఆండ్రీసెన్ మాలిబు ఆస్తిలో 177 మిలియన్ డాల‌ర్ల‌ పెట్టుబడి పెట్టారు. బియాన్స్ - జేజ‌డ్ జంట దీనిని అధిగ‌మించారు. వీరు కొనుగోలు చేసిన భ‌వంతి మొత్తం కాంప్లెక్స్ లో ఆరు భవనాలు ఉన్నాయి. ఇందులో సినిమా గది... వెల్నెస్ సౌకర్యాలు.. నాలుగు బహిరంగ స్విమ్మింగ్ పూల్స్ .. బాస్కెట్ బాల్ కోర్ట్ ఉన్నాయి. గాజు గోడలు .. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలతో పాటు... టెర్రస్ పై అదనంగా 10000 చదరపు అడుగుల బహిరంగ నివాస స్థలం ఉంటుంది.

TMZ ప్రకారం.. ఈ జంట 8 ఎకరాలలో 30000-చదరపు అడుగుల మాలిబు ఇంటిని విలియం బెల్ జూనియర్ నుండి కొనుగోలు చేసారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆర్ట్ కలెక్టర్ గా ప్ర‌సిద్ధి చెందింది. బెల్ పూర్తిగా కాంక్రీట్ నిర్మాణాన్ని నిర్మించడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. ఈ ఇంటిలో బెల్ తాలూకా ప్రైవేట్ ఆర్ట్ సేకరణ ఉంది. ఫీచర్లలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.