Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్' కోసం అమెరికన్ పాప్ సింగర్..?

By:  Tupaki Desk   |   12 Oct 2021 5:30 PM GMT
గాడ్ ఫాదర్ కోసం అమెరికన్ పాప్ సింగర్..?
X
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ''గాడ్ ఫాదర్'' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. ఒరిజినల్ వెర్సన్ లోని ప్లాట్ ను మాత్రమే తీసుకొని చిరు ఇమేజ్ కు తగినట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారు. ఇది మెగాస్టార్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనికి మరిన్ని హంగులు జోడించి 'భారీ' సినిమాగా చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది

తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం 'గాడ్ ఫాదర్' సినిమాలో బ్రిట్నీ స్పియర్ చేత ఓ పాట పాడించాలనే ప్రయత్నం చేస్తున్నారట. చిరు సూచన మేరకు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ఓ సాంగ్ కోసం బ్రిట్నీ ని దింపే ప్రయత్నం చేస్తున్నారట. బ్రిట్నీ స్పియర్స్ గురించి పాప్ సాంగ్స్ వినేవారికి సుపరిచితమే. ఆమె ప్రముఖ అమెరికన్ సింగర్.. సాంగ్ రైటర్.. డ్యాన్సర్ కూడా. తన ఆట పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

'బ్రిట్నీ స్పియర్స్ ను ప్రింట్ తీసినట్లుగా వుందిరో ఈ సుందరి..' అంటూ 'జల్సా' సినిమాలో ఓ సాంగ్ కూడా ఉంది. అంత పాపులర్ పాప్ సింగర్ తో ఇప్పుడు 'గాడ్ ఫాదర్' కోసం పాట పాడించాలని చూస్తున్నారట. ఇదే కనుక సాధ్యమైతే ఈ సినిమాకు వచ్చే క్రేజ్ మరో స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ప్లాన్ తోనే మేకర్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిరవ్ షా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.