Begin typing your search above and press return to search.
ప్రియాంక పై విషం కక్కి.. సారీ చెప్పింది
By: Tupaki Desk | 9 Dec 2018 5:24 AMబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ పాప్ సింగర్.. నటుడు నిక్ జోనాస్‌తో మూడు ముళ్లు వేయించుకుని వైవాహిక జీవితంలో కి అడుగు పెడుతున్న వేళ.. ఆమె మీద విషం కక్కుతూ ఓ అమెరికన్ జర్నలిస్ట్ రాసిన కథనం తీవ్ర దుమారమే రేపింది. ‘ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల ప్రేమ నిజమైందేనా?’ అనే టైటిల్ పెట్టి మరియా స్మిత్ అనే జర్నలిస్ట్ ‘ది కట్’ అనే వెబ్ సైట్ లో ఈ కథనం రాసింది. దీని పై తీవ్ర విమర్శలు రావడంతో మరియా స్మిత్ భయపడ్డట్లుంది. ప్రియాంక చోప్రాతో పాటు నిక్ జోనాస్ కు క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ కథనాని కి తనదే పూర్తి బాధ్యత అని.. తప్పు చేసిన తనను మన్నించాలని వేడుకుంది. ‘‘ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్ లను మనస్ఫూర్తి గా క్షమాపణలు కోరాలనుకుంటున్నా. వారి తో పాటు గా నా రాతల వల్ల బాధ పడిన పాఠకులను కూడా క్షమాపణ అడుగుతున్నా. నిజాని కి జాత్యహంకారం.. జినోఫోబియా వంటి వాటిని నేను సహించను. నేను రాసిన కథనాని కి పూర్తి బాధ్యత నాదే. నిజంగా నేను తప్పు చేశాను. క్షమించండి’’ అని ట్విట్టర్లో మరియా పేర్కొంది.
హలీవుడ్లో తన కెరీర్ ఎదుగుదల కోసమే నిక్ ను ట్రాప్ చేసి ప్రియాంక పెళ్లి చేసుకుందని ఈ కథనంలో మరియా పేర్కొంది. ‘ప్రియాంక సూపర్‌స్టార్’ అంటూ వ్యంగ్యంగా ఆర్టికల్ ఆరంభించిన మరియా.. ఆమె రేసిస్ట్ అని.. సెక్సిస్ట్ అని.. గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్ అని పరుష పదాల్ని ఉపయోగించింది. దురుద్దేశంతో.. అక్కసుతో ప్రియాంక మీద విషం కక్కినట్లు గా భావించిన భారతీయ అభిమానులతో పాటు వేరే దేశాల వాళ్లు సైతం సోషల్ మీడియాలో మరియా పై దుమ్మెత్తి పోశారు. దీంతో ప్రియాంక పై కథనాన్ని ‘ది కట్’ యాజమాన్యం తొలగించింది. ప్రియాంక.. నిక్ లను క్షమాపణలు కూడా కోరింది. ఇప్పుడు మరియా కూడా వారి ని మన్నించమని వేడుకుంది.