Begin typing your search above and press return to search.

టాలీవుడ్ 'పవర్ స్టార్' పై చర్చకు తెరలేపిన అమెరికన్ నటి..!

By:  Tupaki Desk   |   26 Oct 2022 10:38 AM GMT
టాలీవుడ్ పవర్ స్టార్ పై చర్చకు తెరలేపిన అమెరికన్ నటి..!
X
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెల్పింది. గత ఏడు నెలల క్రితం వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సంపాదించుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ ఇటీవలే జపాన్ భాషలోనూ విడుదలైంది. అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబడుతూ సత్తా చాటుతోంది.

ఇటీవల 'ఆర్ఆర్ఆర్' టీం జపాన్ వెళ్లి మరీ అక్కడ ప్రమోషన్స్ చేశారు. జపానీయులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు. ఫలితంగా ఈ సినిమా జపాన్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఆస్కార్ రేసులో ఈ చిత్రాన్ని నిలుపాలని భావిస్తున్న రాజమౌళికి జపాన్లోనూ ఈ చిత్రం విజయవంతం కావడం మరింత కలిసి రానుంది.

'ఆర్ఆర్ఆర్' మూవీని చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గతంలోనే ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీని అమెరికన్ నటి.. టీవీ వ్యాఖ్యాత రెబెకా గ్రాంట్ చూసినట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. ఈ సినిమాను చూసినందుకు చాలా ఆనందంగా ఉందంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

హీరో ప్రభాస్.. రాంచరణ్.. ఎన్టీఆర్ ఇంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి కంటే ముందు టాలీవుడ్లో పవర్ స్టార్? ఎవరంటూ అభిమానులను రెబెకా గ్రాంట్ ప్రశ్నించింది. ఆమె ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి అని సమాధానం ఇస్తున్నారు. తన స్వయంకృషితో చిరంజీవి మెగాస్టార్ గా ఎదగారని.. ఆయన అద్భుతమైన నటుడు.. డ్యాన్సర్ అంటూ రిప్లయ్ ఇస్తున్నారు.

దీనిపై రెబెకా గ్రాంట్ స్పందిస్తూ ప్రభాస్.. రాంచరణ్.. ఎన్టీఆర్ కంటే ముందు ఇండియాలో మెగా పవర్ స్టార్ చిరంజీవేనా? అంటూ ప్రశ్నించింది. ఆయనే అయితే చిరంజీవికి సంబంధించిన సినిమాల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటే తనకు సూచించాలని కోరింది. దీంతో నెటిజన్లు చిరంజీవి నటించిన పలు సినిమాల పేర్లను ఆమెకు సూచిస్తున్నారు. ఈ న్యూస్ కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.