Begin typing your search above and press return to search.

బద్రి బ్యూటీ.. ఈ ఫోజ్ ఏంటమ్మా?

By:  Tupaki Desk   |   31 Oct 2017 5:16 PM GMT
బద్రి బ్యూటీ.. ఈ ఫోజ్ ఏంటమ్మా?
X
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన హీరోయిన్స్ ఎవ్వరైనా సరే అభిమానులకి చాలా ఈజీగా గుర్తుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ హిట్టు సినిమాల్లో కనిపించిన ముద్దుగుమ్మలు చాలా వరకు తొందరగా క్రేజ్ ని సంపాదించుకుంటారు. పవర్ స్టార్ కెరీర్ లో బద్రి సినిమా చూసిన వారు ఎవరైనా అందులో సరయు పాత్రను చేసిన అమీషా పటేల్ ను అస్సలు మర్చిపోలేరు.

బద్రి సినిమా తర్వాత అమీషా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి ఛాన్సులను దక్కించుకొంది. ఇక తెలుగులో మహేష్ నాని సినిమాలో కూడా నటించింది. కాకపోతే ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో టాలీవుడ్ లో ఛాన్సులు అంతగా రాలేవు. కానీ బాలీవుడ్ లో మాత్రం మొన్నటి వరకు బాగానే రాణించినా ఈ మధ్యన చాలా స్లో అయ్యింది. స్పెషల్ గెస్ట్ రోల్స్ లో కనిపిస్తూ ఇంకా సినీ కేరీర్ ను 44 ఏళ్ల వయసులో కూడా లాక్కోస్తోంది. ఇక అసలు విషయం ఏమిటంటే..ఈ మధ్యన అమీషా కొన్ని హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో బాగా పోస్ట్ చేస్తోంది. దీంతో నెటీజన్స్ అమీషాపై ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే మొత్తంగా క్లివేజ్ షో తో కనిపించి..చూసిన వారికి ఎదో తెలియని ఫీలింగ్ ని కలిగిస్తోంది. అందుకే నెటిజన్లు మాత్రం కనీసం ని వయసుకు తగ్గట్టు ఉండు.. ఈ ఏజ్ లో ఆ ఫోజులు అవసరమా అని ఓక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అమ్మడు కొన్ని సార్లు తన కామెంట్స్ తో కాంట్రవర్సీలను కూడా సృష్టించింది. ఓ జర్నలిస్ట్ ఆమెను పేరుపెట్టి పిలిస్తే.. కాల్ మీ అమీషా జీ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చేసింది. ఇక అప్పట్లో హృతిక్ రోషన్ - మొహేంజో దారో సినిమా మొదటి షోకే సినిమా అంత బాగాలేదని కూడా కొన్ని కామెంట్స్ చేసింది.