Begin typing your search above and press return to search.

వేత‌న అస‌మాన‌త్వంపై బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్

By:  Tupaki Desk   |   4 July 2023 9:09 AM GMT
వేత‌న అస‌మాన‌త్వంపై బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్
X
ప్రియాంక చోప్రా జోనాస్ సిటాడెల్ కోసం మేల్ న‌టుల‌కు స‌మానంగా పారితోషికం అందుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. నాటి నుంచి బాలీవుడ్ లో వేతన సమానత్వంపై విస్త్ర‌త చ‌ర్చ సాగుతోంది. బ‌ద్రి ఫేం అమీషా పటేల్ వేత‌న అస‌మాన‌త‌పై తాజాగా ఆస‌క్తిక‌రంగా వ్యాఖ్యానించింది. బాలీవుడ్‌ లేదా హాలీవుడ్ లో వేతన సమానత్వం స‌మ‌స్య‌ లేదని అమీషా పేర్కొంది. వేతన అసమానత్వాన్ని ఖండిస్తూ సెట్ లో ఇరువురికీ సమాన సౌకర్యాలు ఇవ్వాల‌ని కోరింది. అలాగే హీరో వల్లే సినిమా అమ్ముడుపోతోందని అమీషా వ్యాఖ్యానించింది.

వేత‌న స‌మాన‌త్వం అనేది హాలీవుడ్ లో కూడా లేదు. ఇంకా నిజం చెప్పాలంటే సినిమా అనేది హీరో భుజాల మీద నడుస్తుంది. మనం దానిని అంగీక‌రించేందుకు ఎందుకు దూరంగా పారిపోతున్నాము? నా సహనటులకు ఇచ్చే వేతనమే నాకు ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌గ‌ల‌ను. కానీ నిజం ఏమిటంటే.. హీరో వల్ల సినిమా అమ్ముడవుతోంది కాబట్టి అతను దానికి అర్హుడు అని వ్యాఖ్యానించింది. త‌న‌కు మహిళా యోధురాలు అని పిలుచుకోవడం ఇష్టం లేదని చెబుతూనే సెట్ లో నా సహనటుడిలా నాకు అంత కంఫర్ట్ ఇవ్వండి.

ఎందుకంటే మేము కఠినమైన పర్యావరణ పరిస్థితులలో పని చేస్తాము. నేను నిజానికి నా అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటాను. ఒక అమ్మాయికి అలంకరణ దృష్ట్యా ఇలాంటి సౌక‌ర్యాలు ఇవ్వ‌డం క‌ష్ట‌మే. కానీ మంచులో సన్నని షిఫాన్ లో ఎంత సేపు ఉండ‌గ‌లం? హీరో మంచులో కోట్ ధ‌రించి సౌక‌ర్యంగా ఉంటారు. కానీ మాకు అలా కుద‌ర‌దు. కానీ ఇది మాకు పర్యావరణపరంగా కష్టం.. అని అమీషా వ్యాఖ్యానించింది.

అంతేకాదు.. షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్- సన్నీ డియోల్ - అజయ్ దేవగన్ ల కోసం ప్రేక్షకులు ఇంకా థియేట‌ర్ల‌కు వస్తున్నందున నాకు సమానమైన వేతనం కావాలని నేను ఎప్పుడూ చెప్పను. మేము (మహిళా ప్రముఖులు) మా పాత్ర‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌నను ఇస్తాము.

అయితే ఒక సోలో హీరో సినిమా సాధించిన‌ బాక్సాఫీస్ నంబర్ లతో పోలిస్తే ఎన్ని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు అంత గొప్ప‌గా వ‌సూళ్ల‌ను చేశాయి? అన్న‌ది చూడాలి. కాబట్టి మనల్ని మనం ఎందుకు మోసం చేసుకోవాలి? నేను మూర్ఖురాలిని కాను అని అమీషా వ్యాఖ్యానించింది.

అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ 2లో స‌న్నీడియోల్ స‌ర‌స‌న న‌టించిన అమీషా వ‌రుస ఇంట‌ర్వ్యూలతో హోరెత్తిస్తోంది. గ‌ద‌ర్ 2 ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రం అక్షయ్ కుమార్ OMG 2తో ఘర్షణ పడుతోంది.