Begin typing your search above and press return to search.
బద్రి పాప ఎన్జీవో సేవ.. ఇంతలోనే ఈ వేషం?
By: Tupaki Desk | 6 July 2020 7:50 AM GMTకొందరిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఓవైపు సామాజిక సేవ అంటూనే మరోవైపు వేడెక్కించే అవతారంతో సెగలు పుట్టిస్తుంటారు. ఆ కోవకే చెందుతుంది అందాల అమీషా పటేల్.
కహోనా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్ లో .. బద్రి సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన ఈ పాల బుగ్గల బ్యూటీ కెరీర్ అనూహ్యంగా ట్రామాలో పడింది. అటు బాలీవుడ్ లో పెద్ద రేంజు స్టార్ల సరసన నటించినా కానీ తెలుగులో ఎందుకనో వెలగలేకపోయింది. ఇక్కడ బలాయ్య సరసన ఓ సినిమా చేసినా సరైన హిట్లు దక్కలేదు.
అదంతా సరే కానీ.. అమీషా రెగ్యులర్ గా ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలు వీడియోలు చూస్తే .. అసలు లేటు వయసులో ఈ అమ్మడికి ఈ వేషాలేమిటి? అనే వాళ్లు ఉన్నారు. అక్కడ వేడెక్కించే హాట్ లుక్స్ తో ఓవర్ ఎక్స్ పోజ్ చేసిన ఫోటోల్ని అమీషా షేర్ చేస్తుంటుంది. బోల్డ్ అవతారంలో ఏదైనా పాత్ర ఇస్తే కాదనకుండా అంగీకరించేందుకు ఈ అమ్మడు సిద్ధమే. ఇదిగో తాజాగా డెనిమ్స్ లుక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. `నేను ఎలా హాట్ అవ్వాలనుకుంటున్నాను !!!`` అంటూ చమత్కరించింది. నవ్వు ముఖంతో లిప్ స్టిక్ ఎమోజీలు షేర్ చేసింది.
దీనికి ఫ్యాన్స్ నుంచి ధీటుగానే స్పందన కనిపిస్తోంది. హాట్‌నెస్.. సూపర్ హాట్.. బ్యూటిఫుల్.. ఫిట్ అండ్ ఫ్యాబులస్ అంటూ వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. అమీషా ఓవైపు ఎన్జీవో సేవలు చేస్తోంది. మురికివాడల్లోని పేద మహిళలకు మాస్కులు.. శానిటరీ న్యాప్కిన్లు .. ఆహార పదార్థాలను పంపిణీ చేసింది. ఆమె షేర్ చేసిన వీడియోను చూస్తే ఎన్జీవో సభ్యులను కలుసుకుందని అర్థమవుతోంది. ముంబై ధారావిలో కరోనా కలకలం తెలిసిందే. అమీషా తరహాలోనే ఇతర నాయికలు సాయమందిస్తే కొంతవరకూ మేలు జరుగుతుందనడంలో సందేహమేం లేదు.