Begin typing your search above and press return to search.

అంబేద్కర్-భగత్-కాలా-ఏంటి కనెక్షన్?

By:  Tupaki Desk   |   3 March 2018 5:01 AM GMT
అంబేద్కర్-భగత్-కాలా-ఏంటి కనెక్షన్?
X
కాలా టీజర్ ఫాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చింది కాని సగటు ప్రేక్షకుడికి మాత్రం హాఫ్ మీల్స్ తిన్న ఫీలింగే కలిగించింది. వదిలింది నిమషమే కాబట్టి ట్రైలర్ వచ్చాక మరోసారి అంచనాకు రావొచ్చు. ఇప్పటి దాకా వచ్చినవి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్లస్ టీజర్ మాత్రమే కాబట్టి ముందు ముందు చేసే ప్రమోషన్ లో వచ్చే స్టఫ్ ని బట్టి అభిప్రాయం మారే అవకాశం ఉంది. కాని పోస్టర్ - టీజర్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ అందరిని ఆలోచనలో పడేస్తోంది. గతంలో విడుదల చేసిన కాలా పోస్టర్ లో రజనికాంత్ కూర్చున్న జీప్ నెంబర్ MH 01 BR 1956. నిన్న విడుదల చేసిన టీజర్ లో జీప్ మీద MH 09 PR 1931 అని ఉంది. ఏం ఇందులో కాలా పాత్రకు రెండు జీపులు ఉండకూడదా అనే అనుమానం రావొచ్చు. ఇక్కడే ఉంది అసలు లింక్. బ్యాక్ డ్రాప్ పరంగా చూసుకున్నా కాలా పాత్ర చిత్రణ పరంగా చూసుకున్నా ఇందులో హీరో పాత్ర ఆడంబరాలకు పోయేది కాదు. ఖచ్చితంగా ఒకే జీప్ ఉంటుంది.

మరి ఇలా నెంబర్ ప్లేట్ల వెనుక చిక్కుముడి ఏమై ఉంటుంది అనే దాని గురించి అభిమానులు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. మొదటి నెంబర్ తీసుకుంటే 1956 రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వర్గస్తులైన సంవత్సరం. పైగా నెంబర్ ప్లేట్ లో ఆయన ఇనిషియల్ పెట్టారు. ఇక టీజర్ లో నెంబర్ ప్లేట్ లో ఉన్న 1931 బ్రిటిషర్ల చేతిలో భగత్ సింగ్ వీర మరణం పొందిన సంవత్సరం. దర్శకుడు రంజిత్ పాలో విప్లవ అభ్యుదయ భావాలు ఎక్కువ. అది కబాలి సినిమాలో అంతకు ముందు కార్తితో తీసిన మద్రాస్ సినిమాలోనూ బాగా గమనించవచ్చు. వాళ్ల మీద గౌరవంతో అలా పెట్టాడా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది విడుదల అయ్యాకే తెలుస్తుంది.

ఇలాంటి వాటికే అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు. రంజిత్ పా అభ్యుదయ భావజాలం అంటే తమకూ గౌరవమే అని కాని వాటిని రజని లాంటి కమర్షియల్ హీరో ఉన్న సినిమాలో చొప్పిస్తే అంతగా వర్క్ అవుట్ కావని అభిప్రాయపడుతున్నారు. కబాలి విడుదల సమయంలో రంజిత్ పా ఇంటి పైకి దాడి చేసినంత పని చేసిన ఫాన్స్ ఈసారి కంటెంట్ లో తేడా వస్తే మాత్రం సింపుల్ గా క్షమించేలా లేరు.