Begin typing your search above and press return to search.

AMB విక్టరీ మ‌ల్టీప్లెక్స్ సార‌థులుగా `మహేష్- రానా- వెంకీ`

By:  Tupaki Desk   |   17 Oct 2021 9:30 AM GMT
AMB విక్టరీ మ‌ల్టీప్లెక్స్ సార‌థులుగా `మహేష్- రానా- వెంకీ`
X
టాలీవుడ్ స్టార్ హీరోల‌తో టైఅప్ ల‌తో దూసుకెళుతోంది ఏషియ‌న్ సినిమాస్ సంస్థ‌. మల్టీప్లెక్స్ చైన్ విస్త‌ర‌ణ‌తో నిరంత‌రం ఏషియన్ సినిమాస్ కార్య‌క‌లాపాల గురించి తెలిసిన‌దే. తెలుగు రాష్ట్రాల్లో విలాసవంతమైన మల్టీప్లెక్స్ లను నిర్మించేందుకే ఈ భాగ‌స్వామ్యాన్ని అన‌స‌రిస్తున్నారు. మహేష్ బాబు AMB సినిమాస్.. విజయ్ దేవరకొండ AVD సినిమాస్‌.. ని ఇప్ప‌టికే లాంచ్ చేశారు.

త‌దుప‌రి అల్లు అర్జున్ AAA సినిమాస్ ని ఏషియన్ సినిమాస్ సంస్థ భాగ‌స్వామ్యంలో నిర్మించింది. బ‌న్ని సొంత మల్టీ ప్లెక్స్ ను అమీర్ పేట్ లో ప్రారంభించబోతున్నాడని తెలిసింది. తాజా స‌మాచారం మేర‌కు.. రానా దగ్గుబాటి - వెంకటేష్ దగ్గుబాటి కూడా ఈ జాబితాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట‌. మహేష్ బాబు- రానా -వెంకటేష్ ల‌తో ఆర్టీసీ X రోడ్లలో `AMB విక్టరీ` పేరుతో కొత్త మల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలిసింది.

ఇది దేవి -సుదర్శన కాంప్లెక్స్ ప్రక్కనే ఉంటుంద‌ని తెలిసింది. సుదర్శన్ 70ఎంఎం గతంలో ఈ ప్రదేశంలో ఉండేది. దీనికి ఎదురుగానే మరొక మల్టీప్లెక్స్ కూడా నిర్మిస్తున్నారు. గతంలో ఒడియన్ కాంప్లెక్స్ ఉన్న చోటు ఇది. ఓవ‌రాల్ గా సింగిల్ స్క్రీన్ హబ్ అయిన RTC X రోడ్స్ నెమ్మదిగా మల్టీప్లెక్స్ హ‌బ్ గా మారుతుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మునుముందు తెలుగు స్టేట్స్ లో చాలా చోట్ల సింగిల్ థియేట‌ర్లు క‌నుమ‌రుగై ఆ స్థానాల్లో మ‌ల్టీప్లెక్సులు మొద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.