Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : AMB ఇంద్ర‌భ‌వ‌నం

By:  Tupaki Desk   |   15 Nov 2018 4:30 AM GMT
ఫోటో స్టోరీ : AMB ఇంద్ర‌భ‌వ‌నం
X
మాయావ‌నంలో ప్ర‌వేశించిన దుర్యోధ‌నుడు క‌న్ ఫ్యూజ్ అయిన‌ తీరుగా ఈ AMB సినిమాస్‌ కి వెళ్లిన వాళ్లు ఇంకెంత క‌న్ ఫ్యూజ్ అయిపోతారో? ఈ థియేట‌ర్‌ లో అన్ని గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తులున్నాయ్‌! ఇట‌లీ లేక్ కోమోకే త‌ల‌తిరిగే రేంజు డెక‌రేష‌న్‌ తో అబ్బో అనిపిస్తోంది. విదేశీ ఆర్కిటెక్కుల నైపుణ్య‌మో.. రాజీ ప‌డ‌ని పెట్టుబ‌డుల ఫ‌ల‌మో తెలీదు కానీ.. ఇక్క‌డ లేని సౌక‌ర్యం లేదు. స‌క‌ల సౌక‌ర్యాల‌తో స్వ‌ర్గలోకాన్ని భూలోకానికి దించిన‌ట్టే క‌నిపిస్తోంది. సూప‌ర్‌ స్టార్ మ‌హేషా మ‌జాకానా? AMB సినిమాస్ అన్న పేరుకు త‌గ్గ‌ట్టే అల్ట్రా రిచ్ లుక్‌ తో `శ్రీ‌మంతుడు` అంత స్మార్టుగా ఉంది.

ఈ థియేట‌ర్‌ లో సినిమా వీక్షించేందుకు విచ్చేసిన‌ జ‌నం ఆ భారీ ప్రాకారాలు వీక్షించి.. దుర్యోధ‌నుడు మాయావ‌నాన్ని వ‌ర్ణించిన చందంగా మైమ‌రిచి డైలాగులు చెప్పాల్సి ఉంటుందేమో! మ‌హేష్‌- న‌మ్ర‌త అభిరుచి ఎంత అల్ట్రా రిచ్‌ గా ఉంటుందో ఏఎంబి సినిమాస్ లుక్ చెబుతోంది. మ‌ల్టీప్లెక్స్ ప్రాంగ‌ణ‌మంతా అరుదైన డిజైనింగ్‌ తో ఆక‌ట్టుకుంటోంది. గ‌చ్చిబౌళిలో సాఫ్ట్ వేర్ హ‌బ్‌ కి కూత‌వేటు దూరంలో ఉన్న కొత్త‌గూడ జంక్ష‌న్‌ కి స‌మీపంలో మొట్ట‌మొద‌టి వెంచ‌ర్ ఇది.

ఇది ఆరంభం మాత్ర‌మే. ఇక‌పై AMB సినిమాస్ థియేట‌ర్లు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్త‌రించ‌నున్నాయి. అందుకోసం భారీ మ‌ల్టీప్లెక్సె చెయిన్ బిజినెస్‌ కి మ‌హేష్ & కో ప్లాన్ చేయ‌డం ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు తెర‌తీసింది. ఈ బిజినెస్‌ లోకి వంద‌ల కోట్లు వెల్లువెత్త‌నున్నాయ‌న్న చ‌ర్చా సాగుతోంది. టాలీవుడ్ టాప్ హీరోలు - టాప్ ఎర్న‌ర్స్ ఈ త‌ర‌హా మ‌ల్టీప్లెక్స్ వ్యాపారాలపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న వేళ‌.. ఆ న‌లుగురుకి పోటీగా థియేట‌ర్ బిజినెస్‌ లోకి మ‌హేష్ దూసుకురావ‌డం మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హార‌మేన‌న్న ముచ్చ‌టా ఫిలింన‌గ‌ర్‌ లో వినిపిస్తోంది. గ‌చ్చిబౌళి AMB సినిమాస్ ఇంద్ర‌భ‌వ‌నం లో తొలిగా సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 2.ఓ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ థియేట‌ర్ లాంచ్ కోసం సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ అతిధిగా విచ్చేయనున్నారట‌.