Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ తమ్ముడి మూవీని అన్ని కోట్లకు కొన్నారా.. నిజమేనా?

By:  Tupaki Desk   |   24 Oct 2020 1:00 PM GMT
విజయ్ దేవరకొండ తమ్ముడి మూవీని అన్ని కోట్లకు కొన్నారా.. నిజమేనా?
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ డ్రామా 'దొరసాని' తో ప్లాప్ ని మూటగట్టుకున్న ఆనంద్ దేవరకొండ రెండో ప్రయత్నంగా ''మిడిల్ క్లాస్ మెలోడీస్'' అనే చిత్రాన్ని లైన్లో పెట్టాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో వినోద్ అనంతోజు అనే ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. 'చూసి చూడంగానే' 'జాను' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. లాక్ డౌన్ లో అనౌన్స్ చేయబడిన ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాని ఓటీటీ వారు ఎంతకు కొనుగోలు చేశారనే దానిపై ఇండస్ట్రీలో వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా, ఆనంద్ దేవరకొండ ''మిడిల్ క్లాస్ మెలోడీస్'' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు సుమారు 4 కోట్లకు తీసుకున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే ఫస్ట్ సినిమాతో ప్లాప్ అందుకుని.. రెండో ప్రాజెక్ట్ ని ఎలాంటి బజ్ క్రియేట్ చేయకుండా సైలెంటుగా పూర్తి చేసిన హీరో సినిమాకి అంత డిమాండ్ ఉందంటే నమ్మశక్యం కాని విషయమని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓకే సినిమా కొనాలంటే ఎన్నో విధాలుగా లెక్కలు వేసుకుంటాయి. ఈ మధ్య ఓటీటీలో విడుదలవుతున్న మీడియం రేంజ్ సినిమాలనే అన్ని కోట్లు పెట్టి కొనలేదని.. అలాంటిది ఇంకా హిట్ రుచి ఎరుగని హీరో సినిమాని 4 కోట్లకు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు నమ్మేలా లేవని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ కెరీర్ కు ''మిడిల్ క్లాస్ మెలోడీస్'' మూవీ చాలా కీలకమనే చెప్పాలి.