Begin typing your search above and press return to search.

'రామ్ సేతు'తో చిత్ర నిర్మాణంలో అడుగుపెడుతున్న అమెజాన్ ప్రైమ్..!

By:  Tupaki Desk   |   17 March 2021 8:33 AM GMT
రామ్ సేతుతో చిత్ర నిర్మాణంలో అడుగుపెడుతున్న అమెజాన్ ప్రైమ్..!
X
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ''రామ్ సేతు'' సినిమా నిర్మాణంలో అమెజాన్ ప్రైమ్ వీడియో భాగస్వామిగా చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 'పరమాణు' ఫేమ్ అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ - అబండంటియా ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మించనున్న ఈ మూవీ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రైమ్ వీడియో వారు ఈ యాక్షన్ అడ్వెంచర్ కు క్రియేటివ్ ప్రొడ్యూసర్ చంద్రప్రకాశ్ ద్వివేదితో కలిసి కో ప్రొడ్యూసింగ్ చేయనున్నట్లు వెల్లడించారు.

'రామ్ సేతు' సినిమా భారతీయ సంస్కృతి మరియు చారిత్రిక వారసత్వ మూలాల ఆధారంగా తెరకెక్కుతున్న ఒక యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. ఇందులో అక్షయ్‌ కుమార్‌ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ - నుష్రాత్‌ భరుచ్ఛా ప్రధాన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ని మార్చి 18న అయోధ్యలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. 'రామ్ సేతు' సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన అనంతరం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఏదేమైనా థియేటర్ లో విడుదలయ్యే సినిమా నిర్మాణంలో భాగస్వామ్యమైన ఫస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ అని చెప్పవచ్చు.