Begin typing your search above and press return to search.

విడుదలకు ముందే రికార్డులా..? బాహుబలినే బ్రేక్ చేసి మరీ..

By:  Tupaki Desk   |   8 May 2020 5:30 PM GMT
విడుదలకు ముందే రికార్డులా..? బాహుబలినే బ్రేక్ చేసి మరీ..
X
కన్నడ స్టార్ హీరో యశ్ ఒక్కసారిగా 'కేజీఎఫ్' సినిమాతో కన్నడ స్టార్ మాత్రమే కాదు ఇండియన్ స్టార్ గా గుర్తింపు పొందాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ చాఫ్టర్1 మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి కలెక్షన్ల సునామినే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 250కోట్లకు పైచిలుకు వసూల్ చేసిన ఫస్ట్ కన్నడ సినిమాగా కేజీఎఫ్ రికార్డు బద్దలు కొట్టింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు.

అయితే విడుదలకు ముందే ఈ కేజీఎఫ్2 సినిమా డిజిటల్ రికార్డులను బద్దలుకొట్టింది. కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీని 18కోట్ల రూపాయలతో అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులు దక్కించుకుంది. ఆ సినిమా విజయం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.. ప్రస్తుతం కేజీఎఫ్2 డిజిటల్ హక్కులు దిమ్మతిరిగే రేంజ్ లో సొమ్ము చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ క్రియేట్ చేసిన బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ.. 55కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి స్టార్స్ ఇందులో నటిస్తుండటంతో కేజీఎఫ్2 పై ఇంతా క్రేజ్ ఏర్పడిందని చెప్పొచ్చు. అంతేగాక 55కోట్ల భారీ రేటుకు అమ్ముడుపోయి ఫస్ట్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఇంకాస్త వాయిదా పడేలా ఉందని తాజా సమాచారం.