Begin typing your search above and press return to search.

భరత్ అనే నేను.. మరో రికార్డ్

By:  Tupaki Desk   |   23 Jan 2018 5:58 AM GMT
భరత్ అనే నేను.. మరో రికార్డ్
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - భరత్ అనే నేను సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుసగా మహేష్ రెండు డిజాస్టర్స్ అందుకున్నా సరే మహేష్ నెక్స్ట్ సినిమాపై ఏ మాత్రం ఎఫెక్ట్ పడకపోవడం నిజంగా ఆశ్చర్యమే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండడంతో శ్రీమంతుడు కాంబినేషన్ తప్పకుండా హిట్ అవుతుందని సినీ ప్రముఖులతో పాటు బాక్స్ ఆఫీస్ పండింతులు కూడా కామెంట్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే సినిమా బడ్జెట్ లో నిర్మాతకీ 70 - 80% వచ్చాయని తెలుస్తోంది. లహరి మ్యూజిక్ కంపెనీ గత కొన్ని రోజుల క్రితం మంచి ఎమౌంట్ ఇచ్చి ఆడియో హక్కులను అందుకుంది. అయితే రీసెంట్ గా శాటిలైట్ హక్కుల ధర రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు మహేష్ బాబు కెరీర్ లో ఏ సినిమాకు ఆ రేంజ్ లో రాలేదు. మొత్తంగా అన్ని బాషలలో కలిపి స్టార్ మా రూ.39 కోట్లకు దక్కించుకుంది. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై కొన్ని కథనాలు వెలువడుతున్న అంతా రూమర్ అనుకున్నారు.

కానీ ఇప్పుడు అదే నిజమైంది. ఇక డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సినిమా బడ్జెట్ లో దాదాపు 75% రికవర్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా విడుదల అయితే వచ్చే కలెక్షన్స్ అన్ని లాభాలే. సినిమా కాస్త పాజిటవ్ టాక్ తెచ్చుకున్నా చాలు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాలో మహేష్ కు జోడిగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.