Begin typing your search above and press return to search.

జాతిరత్నాలు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. రిలీజ్ ఎప్పుడంటే??

By:  Tupaki Desk   |   11 March 2021 1:30 PM GMT
జాతిరత్నాలు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. రిలీజ్ ఎప్పుడంటే??
X
టాలీవుడ్ యువహీరో నవీన్ పొలిశెట్టి, కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రలలో నటించిన జాతిరత్నాలు సినిమా.. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివరాత్రి సందర్బంగా మార్చ్ 11న అంటే ఈరోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జాతిరత్నాలు మూవీ చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు బిగ్ మూవీస్ లో ఒకటిగా మారింది. ఈ సినిమాకు మొదటినుండి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఎందుకంటే సినిమా సాంగ్స్, ట్రైలర్స్, ప్రీ-రిలీజ్ ప్రచార కార్యక్రమాలు ఇలా అన్నివిధాలా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో జాతిరత్నాలు టీమ్ సక్సెస్ అయిందని చెప్పాలి.

ఎందుకంటే వారి కృషి ఇప్పుడు సినిమాను థియేటర్లలో విజయవంతంగా నడిపిస్తుందని చెప్పవచ్చు. జాతిరత్నాలు సినిమాను ప్రేక్షకులు పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమాకు మంచి హైప్ తో పాటు సక్సెస్ వచ్చిందని టాక్. ఇదిలా ఉండగా.. జాతిరత్నాలు సినిమా విడుదలైందో లేదో అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నట్లు సమాచారం. ఎప్పుడు స్ట్రీమ్ చేస్తారో తెలియదు కానీ త్వరలోనే ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.